Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సొంత సినిమా కోసం గత పదేళ్లుగా పాటిస్తోన్న ఓ రూల్‌ను నయనతార బ్రేక్ చేసింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన తమిళ మూవీ హాయ్ ఇటీవలే రిలీజైంది. ఈ సినిమా కోసం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సినిమా ఆడుతున్న థియేటర్లను సందర్శించింది.
Entertainment | Published On Sep 4, 2026, 2.45 pm IST
Nayanthara | తన సొంత సినిమా కోసం గత పదేళ్లుగా పాటిస్తున్న ఓ రూల్‌ను నయనతార బ్రేక్ చేసింది. తొలి సారి థియేటర్‌లో అడుగుపెట్టింది. కోలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం లేడీ సూపర్ స్టార్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. నయనతార సినిమా షూటింగ్‌లలో మాత్రమే పాల్గొంటుంది. ప్రమోషన్స్‌కు అస్సలు అటెండ్ కాదు. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాదు. సినిమా అయినా వదులుకుంటుంది కానీ ప్రచార కార్యక్రమాల విషయంలో మాత్రం తగ్గేదేలే అని చెబుతుంటుంది.
నో ప్రమోషన్స్...
తెలుగు, తమిళం, మలయాళం...భాష ఏదైనా నో ప్రమోషన్స్ రూల్‌ను తప్పకుండా పాటిస్తుంటుంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సొంత సినిమా కోసం పదేళ్లుగా పాటిస్తున్న ఈ నిబంధనను బ్రేక్ చేసింది. నయనతార హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ హాయ్ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కెవిన్ హీరోగా నటించాడు. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నయనతార స్వయంగా ఈ సినిమాను నిర్మించింది.
ఆడియెన్స్ సర్‌ప్రైజ్...
హాయ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. కాన్సెప్ట్‌తో పాటు నయనతార, కెవిన్ కెమిస్ట్రీ బాగుందంటూ ఆడియెన్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైతో పాటు తిరుచ్చి, మధురైలోని కొన్ని థియేటర్లను నయనతార సందర్శించింది. లేడీ సూపర్ స్టార్‌ను థియేటర్లలో చూసి ఆడియెన్స్ సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యారు. ఇలా థియేటర్లను విజిట్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేయడం నయనతార కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్. సినిమాల ప్రమోషన్స్ విషయంలో నయనతార మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
డబ్బులు పోతాయనే భయంతో...
మరికొందరు నెటిజన్లు ఈ కోలీవుడ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్నారు. సొంత సినిమా కావడంతోనే డబ్బులు నష్టపోతాయనే భయంతోనే నయనతార థియేటర్లకు వచ్చి మరి ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. మరో ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మిస్తే లేడీ సూపర్ స్టార్ థియేటర్‌కు కాదు కదా...కనీసం ఈవెంట్లకు కూడా అటెండ్ అయ్యుండేది కాదని అంటున్నారు. నెటిజన్ల కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
రెండు రోజుల గ్యాప్‌లో...
నయనతార హీరోయిన్‌గా నటించిన హాయ్‌తో పాటు టాక్సిక్ సినిమాలు రెండు రోజుల గ్యాప్‌లో థియేటర్లలోకి వచ్చాయి. యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో యశ్ సోదరిగా నయన్ కనిపించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత

CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..






