త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gorintaku Panduga | న్యూయార్క్‌లో ఘ‌నంగా గోరింటాకు పండుగ‌..

Gorintaku Panduga | తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు సజీవంగా అందించాలనే సంకల్పంతో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను (Gorintaku Panduga) ఘనంగా నిర్వహించారు.

G

Telangana | Published On Aug 19, 2026, 11.50 am IST

Gorintaku Panduga | న్యూయార్క్‌లో ఘ‌నంగా గోరింటాకు పండుగ‌..
Advertisement

Gorintaku Panduga | త్రినేత్ర‌.న్యూస్‌: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు సజీవంగా అందించాలనే సంకల్పంతో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను (Gorintaku Panduga) ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ క్వీన్స్‌లో హనుమాన్ మందిర్ వేదికగా ఈ గోరింటాకు వేడుక జరిగింది. వల్లెం వారి ఫార్మ్స్ (Vallem Vaari Farms) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యూయార్క్ (Newyork) పరిసరాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పవిత్ర శ్రావణమాసంలో (Sravana Masam) గోరింటాకు పెట్టుకోవడం, సంప్రదాయ దుస్తులు ధరించడం, మహిళలు, చిన్నారులు పరస్పరం గోరింటాకుతో అలంకరించుకోవడం లాంటి కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సంస్కృతిలో గోరింటాకుకు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు.

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అనుబంధం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

`మన మూలాలు – మన సంస్కృతి – మన సంప్రదాయం` అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ గోరింటాకు పండుగ (Henna Festival) న్యూయార్క్ లో తెలుగు కుటుంబాలకు మధురమైన జ్ఞాపకంగా నిలిచింద‌ని నైటా కార్య‌వ‌ర్గం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, హనుమాన్ మందిర్ నిర్వాహకులకు, పాల్గొన్న తెలుగు కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
Advertisement