త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | బండి సంజ‌య్‌.. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న‌దెవ‌రు?: ఎంపీ చామల 

Chamala Kiran Kumar Reddy | కాంగ్రెస్ అగ్ర‌నేత‌ సోనియా గాంధీపై (Sonia Gandhi) కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్య‌లపై భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కురాలిపై అవాకులు చ‌వాకులు పేలొద్దంటూ హెచ్చ‌రించారు.

G

Telangana | Published On Aug 19, 2026, 12.24 pm IST

Chamala Kiran Kumar Reddy | బండి సంజ‌య్‌.. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న‌దెవ‌రు?: ఎంపీ చామల 
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ అగ్ర‌నేత‌ సోనియా గాంధీపై (Sonia Gandhi) కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్య‌లపై భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కురాలిపై అవాకులు చ‌వాకులు పేలొద్దంటూ హెచ్చ‌రించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీని (BJP) అధికారంలోకి రాకుండా అడ్డుకున్న‌దెవ‌ర‌ని ప్ర‌శ్నించారు. సోనియాగాంధీకి భారత దేశ సాంప్రదాయాలు, చరిత్ర తెలుసున‌ని, అందుకే యూపీఏ చైర్‌పర్సన్‌గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. ప్ర‌స్తుతం బండి సంజయ్ (Bandi Sanjay) ఎంపీగా ఉన్న కరీంనగర్‌లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా ప్రకటించార‌ని తెలిపారు. ఆమె పుణ్యంతోనే రాష్ట్రం ఏర్పడింద‌ని, మనం ఎంపీలుగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు. సోనియాగాంధీని విమర్శించే స్థాయి బండి సంజయ్‌కి లేద‌ని మండిప‌డ్డారు.

అధికారంలోకి రాకుండా అడ్డుకున్న‌దెవ‌రు..

2014 నుంచి కేంద్రంలో బీజేపీ ఆధికారంలో ఉంద‌ని, కానీ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో (Telangana) ఆ పార్టీని అధికారంలోకి రాకుండా ఆపిందెవ‌ర‌ని ప్ర‌శ్నించారు. ఆ పార్టీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేద‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడుగా, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఇద్దరు ఒకే సమయంలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్నార‌ని వెల్ల‌డించారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం కాలేశ్వరంలో అవినీతి, ఫార్ములా ఈ-కార్‌రేస్‌లో కేటీఆర్‌ అవినీతి చేస్తే బీజేపీ ఎందుకు నిశ్శ‌బ్ధంగా ఉంద‌న్నారు.

బీఆర్ఎస్‌, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌..

2014లో తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ పదేండ్ల‌లో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో బీజేపీకి అధికారం పగటి కలేన‌ని చెప్పారు. 2024 లోక్‌స‌భ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అవయవదానం చేసి బీజేపీని 8 లోక్‌సభ స్థానాల్లో గెలిపించిందని విమ‌ర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయ‌ని ఆరోపించారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో కేటీఆర్ (KTR) ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కి ఎన్ని ఓట్లు వ‌చ్చాయో, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క బయట పెట్టాల‌న్నారు.

తాకట్టుపెట్టారు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల‌కు రూ.22 వేల కోట్లు రుణమాఫీ చేశామ‌ని తెలిపారు. రైతు భరోసా, పంట బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న‌ద‌ని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని.. నిధులు ఇచ్చేది లేద‌ని బండి సంజయ్ అంటున్నారని విమ‌ర్శించారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu Naidu) మానం తాకట్టుపెట్టారని, అందుకే నిధులు ఇస్తున్నామని చెప్పారని వెల్ల‌డించారు.

నిధులు ఇచ్చేది లేదంటున్నారు..

సీఎం రేవంత్ రెడ్డి 100 సార్లు ఢిల్లీకి వచ్చి నిధులు అడిగినా మేము ఇయ్య‌మ‌ని బండి సంజయ్ అన్నార‌ని చెప్పారు. తెలంగాణలో ఉంటే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండాలనే మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Sarkar) వస్తేనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ (RRR), మెట్రో ఫెజ్ 2, మూసీ ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని అడ్డుకుంటున్నారని వెల్ల‌డించారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప నిధులు ఇవ్వమని బండి సంజయ్ చెప్పార‌న్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబు త‌న ఎంపీలను బీజేపీకి తాకట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. 18వ లోక్‌సభ చంద్రబాబుపై ఆధారపడి నడుస్తున్న‌ద‌ని చెప్పారు.

Advertisement
Advertisement