త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iQOO Hackathon 2026 | డెవ‌ల‌ప‌ర్లు, విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఐక్యూ హ్యాక‌థాన్ ప్రైజ్ మ‌నీ రూ.25 ల‌క్ష‌లు..

iQOO Hackathon 2026 | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ ఈ ఏడాదికి గాను ఐక్యూ హ్యాకథాన్‌ 2026ను ప్రకటించింది. దీన్ని దేశంలో తొలి హైబ్రిడ్ మొబైల్ హ్యాకథాన్‌గా నిర్వహించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థి డెవలపర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆసక్తి ఉన్నవారు, కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్న ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకుని ఈ పోటీని రూపొందించారు.

S

Technology | Published On Aug 19, 2026, 11.52 am IST

iQOO Hackathon 2026 | డెవ‌ల‌ప‌ర్లు, విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఐక్యూ హ్యాక‌థాన్ ప్రైజ్ మ‌నీ రూ.25 ల‌క్ష‌లు..
Advertisement

iQOO Hackathon 2026 | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ ఈ ఏడాదికి గాను ఐక్యూ హ్యాకథాన్‌ 2026ను ప్రకటించింది. దీన్ని దేశంలో తొలి హైబ్రిడ్ మొబైల్ హ్యాకథాన్‌గా నిర్వహించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థి డెవలపర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆసక్తి ఉన్నవారు, కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్న ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకుని ఈ పోటీని రూపొందించారు. వాస్తవ ప్రపంచ సమస్యలకు మొబైల్‌ ఆధారిత వర్క్‌ఫ్లోతో సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాకథాన్‌లో సంప్రదాయ డెవలప్‌మెంట్‌ విధానానికి భిన్నంగా స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా డెవలప్‌మెంట్‌ వాతావరణంలో భాగం చేయనున్నారు. ఇందులో రెడ్ లైట్‌, గ్రీన్ లైట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రెడ్ లైట్‌ దశల్లో టీమ్‌లు ప్రధానంగా ఐక్యూ 15 స్మార్ట్‌ఫోన్‌పైనే కోడింగ్‌, డెవలప్‌మెంట్‌ చేయాలి. గ్రీన్ లైట్‌ దశల్లో మొబైల్‌ పనులతోపాటు సాధారణ ల్యాప్‌టాప్‌ డెవలప్‌మెంట్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

పోటీ ఎందుకు..?

ఈ ఛాలెంజ్‌లో ఐక్యూ 15లోని స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, ఆరిజిన్‌ఓఎస్‌ ఆప్టిమైజేషన్లు, ఇంటిగ్రేటెడ్‌ వేపర్‌ కూలింగ్‌ సిస్టమ్‌, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ వంటి హార్డ్‌వేర్‌ సామర్థ్యాలను ఉపయోగించనున్నారు. సుదీర్ఘంగా ప్రోగ్రామింగ్‌ పనులను నిర్వహించడంలో మొబైల్‌ ఎంతవరకు ఉపయోగపడుతుందో పరీక్షించడమే దీని ఉద్దేశం. ప్రాజెక్టులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన పరిశ్రమ నిపుణుల ప్యానెల్‌ పరిశీలిస్తుంది. ఫోన్‌ ఆధారిత అమలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం, ఆఫీస్‌ కిట్‌ ఉపయోగం, వాస్తవ ప్రపంచ ప్రయోజనం, ప్రాజెక్ట్‌ ప్రెజెంటేషన్‌ నాణ్యత వంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టులకు మార్కులు కేటాయిస్తారు. పాల్గొనేవారికి ప్రత్యేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్రెడిట్లు, డజనుకు పైగా పరిశ్రమ నిపుణుల నుంచి మార్గదర్శకత్వం కూడా ల‌భిస్తుంది.

ఏయే తేదీల్లో..

ఈ పోటీని నాలుగు ప్రధాన టెక్నాలజీ కేంద్రాల్లో 30 గంటల ప్రాంతీయ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో బెంగళూరు సిటీ బ్యాటిల్‌తో పోటీలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో పూణెలో, సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో చెన్నైలో, సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రాంతీయ పోటీలు జరుగుతాయి. అనంతరం అక్టోబర్‌ 9 నుంచి 11 వరకు బెంగళూరులో గ్రాండ్‌ ఫినాలే నిర్వహించి జాతీయ విజేతను ఎంపిక చేస్తారు. ప్రతి ప్రాంతీయ సిటీ బ్యాటిల్‌కు రూ.6 లక్షల ప్రైజ్‌పూల్‌ ఉంటుంది. ఇందులో విజేత, ఫస్ట్‌ రన్నరప్‌, సెకండ్‌ రన్నరప్‌, స్పెషల్‌ ఆనర్‌ అవార్డులు, అత్యుత్తమ ప్రాజెక్టులకు నగదు బహుమతులు అందించనున్నారు. ప్రతి ప్రాంతీయ పోటీలో విజేతలతో పాటు ఆన్‌లైన్‌ సమర్పణల నుంచి ఎంపికైన కొందరు అభ్యర్థులు బెంగళూరులో జరిగే గ్రాండ్‌ ఫినాలేకు అర్హత సాధిస్తారు. గ్రాండ్‌ ఫినాలేలో ప్రత్యేకంగా రూ.25 లక్షల జాతీయ ప్రైజ్‌పూల్‌ కోసం పోటీ ఉంటుంది. అర్హత కలిగిన డెవలపర్లు, విద్యార్థులు ప్రస్తుతం అధికారిక పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement