Telangana Cabinet | ఆటో డ్రైవర్లకు కొత్త పథకం.. సబ్సిడీ రూ. లక్షా 50 వేలు
Telangana Cabinet | హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకువచ్చింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది.
Telangana Cabinet | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకువచ్చింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ. లక్షా 50 వేలు సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి.. హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది అని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలు తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●1947లో జెండా ఎగిరినా… గోవా, హైదరాబాద్, కాశ్మీర్ ఇంకా పరాయి చేతుల్లోనే!
- ●Telangana Cabinet | సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలు ఇవే..
- ●Malla Reddy | 22A యాడికెళ్లొచ్చింది? ఎవల్దెచ్చిర్రు.. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొంరాస్‌పేట రైతుల భూములు కాపాడాలే
- ●Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి
- ●Stock Markets | వరుసగా రెండు వారాల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..

1947లో జెండా ఎగిరినా… గోవా, హైదరాబాద్, కాశ్మీర్ ఇంకా పరాయి చేతుల్లోనే!

Telangana Cabinet | సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Malla Reddy | 22A యాడికెళ్లొచ్చింది? ఎవల్దెచ్చిర్రు.. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొంరాస్‌పేట రైతుల భూములు కాపాడాలే

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి





