SEC | మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే.. ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు: ఎస్ఈసీ
SEC | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు (Ex-oficio vote) వేసే అర్హత ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టం చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
SEC | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు (Ex-oficio vote) వేసే అర్హత ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టం చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సుమారు 40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలపై ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై కొత్త మార్గదర్శకాలు జారీచేసింది.
మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వేసిన ఓటు చెల్లదని, అలాంటి వారిని సభ్యుడిగా పరిగణించరని పేర్కొంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం పక్కాగా నిబంధనల అమలు చేయాలని లెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లను సర్క్యులర్ జారీ చేసింది.
కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈనేపథ్యంలో చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

MPTC ZPTC Elections | మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. సన్నాహాలు ప్రారంభించిన ఎస్ఈసీ!
ఏప్రిల్ 18, 2026

Minor Girls | 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి.. 350 అసభ్యకర వీడియోలు తీసి..
ఏప్రిల్ 15, 2026

ED Raids | పంజాబ్ రాజ్యసభ సభ్యుడి అశోక్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు..!
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



