MPTC ZPTC Elections | మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. సన్నాహాలు ప్రారంభించిన ఎస్ఈసీ!
MPTC ZPTC Elections | రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు (MPTC ZPTC Elections) రంగం సిద్ధమైంది. మే నెలలో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌కు సంబంధించిన పనులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రారంభించింది.
MPTC ZPTC Elections | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు (MPTC ZPTC Elections) రంగం సిద్ధమైంది. మే నెలలో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌కు సంబంధించిన పనులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2025, జూన్ 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసింది.
తద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిధిలోని గ్రామపంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించనున్నారు. వాటిని జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించిన తర్వాత, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఆ డేటాలో ఏవైనా తేడాలు ఉన్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించింది. అనంతరం ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల జాబితాను ఇప్పటికే రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ.. దానిని ఎస్ఈసీకి పంపించింది. మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, మండల ప్రజాపరిషత్ చైర్‌పర్సన్లు (MPP), 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. కాగా, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పూర్తిగా మున్సిపాలిటీలే ఉండటంతో ఇక్కడ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించరు. అదేవిధంగా 2019 తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చాలా గ్రామపంచాయతీలు విలీనమవడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిపోయింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



