త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | పండుగ ర‌ద్దీ.. గుంటూరు- వికారాబాద్.. హైద‌రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు

Special Trains | స్కూళ్లు, కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. శ‌నివారం బ‌తుక‌మ్మ పండుగ. వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో తీపి కబురు చెప్పింది.

G

Telangana | Published On Oct 9, 2026, 8.09 am IST

Special Trains | పండుగ ర‌ద్దీ.. గుంటూరు- వికారాబాద్.. హైద‌రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు
Advertisement

Special Trains | త్రినేత్ర న్యూస్‌: స్కూళ్లు, కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. శ‌నివారం బ‌తుక‌మ్మ పండుగ. వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నది. ఇందులో గుంటూరు-వికారాబాద్ -గుంటూరు, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఢిల్లీలోని (Delhi) హజ్రత్ నిజాముద్దీన్‌కు వన్‌వే పండుగ ప్రత్యేక రైళ్లను న‌డుపుతున్న‌ది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

గుంటూరు-వికారాబాద్‌-గుంటూరు స్పెష‌ల్‌.. 

గుంటూరు - వికారాబాద్ (రైలు నంబరు- 07227): ఈ రైలు అక్టోబ‌ర్ 8, 10 తేదీల్లో రాత్రి 21.45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ - గుంటూరు (రైలు నంబరు- 07228): తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబ‌ర్ 9, 11 తేదీల్లో రాత్రి 22.00 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

ఎక్క‌డ అగుతుందంటే..

ఈ రెండు రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్ల‌గొండ, చ‌ర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ఢిల్లీకి వన్ వే స్పెషల్ రైళ్లు..

ఈ రైళ్లు ఒక ట్రిప్ మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబరు- 07031): అక్టోబర్ 9 (శుక్రవారం) రాత్రి 23.25 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. రెండు రోజుల ప్రయాణం తర్వాత (రెండో రోజు) ఉదయం 11.55 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బందా, వీజీఎల్‌ ఝాన్సీ, గ్వాలియర్ ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతుంది.

చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబరు- 07035): అక్టోబ‌ర్ 11న (ఆదివారం) రాత్రి 23.55 గంట‌ల‌కు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 11.55 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బందా, వీజీఎల్‌ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతుంది.

 

 

Advertisement
Advertisement