త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SCR Special Trains | సంక్రాంతికి 16 అద‌న‌పు ప్ర‌త్యేక రైళ్లు.. వివ‌రాలివే

SCR Special Trains | సంక్రాంతి పండుగ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి ప‌లు ప్రాంతాల‌కు 16 అద‌న‌పు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.

S

Telangana | Published On Dec 17, 2025, 7.27 pm IST

SCR Special Trains | సంక్రాంతికి 16 అద‌న‌పు ప్ర‌త్యేక రైళ్లు.. వివ‌రాలివే
Advertisement

SCR Special Trains | హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి ప‌లు ప్రాంతాల‌కు 16 అద‌న‌పు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్ర‌త్యేక రైళ్లు జ‌న‌వ‌రి 9వ తేదీ నుంచి 19 వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అద‌న‌పు ప్ర‌త్యేక రైళ్ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ప్ర‌త్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌రికొన్ని రైళ్లు వికారాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా శ్రీకాకుళం రోడ్డు వ‌ర‌కు న‌డ‌వ‌నున్నాయి.

సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వ‌ర‌కు వెళ్లే ప్ర‌త్యేక రైళ్లు.. చ‌ర్ల‌ప‌ల్లి, కాజీపేట్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, రాయ‌న‌పాడు, ఏలూరు, రాజ‌మండ్రి, అన‌ప‌ర్తి, సామ‌ల్‌కోట్‌, అన్న‌వ‌రం, తుని, య‌ల‌మంచిలి, అన‌కాప‌ల్లి, దువ్వాడ‌, పెందుర్తి, కొత్త‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి స్టేష‌న్ల‌లో ఆగ‌నున్నాయి.

వికారాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వెళ్లే ప్ర‌త్యేక రైళ్లు.. లింగంప‌ల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చ‌ర్ల‌ప‌ల్లి, కాజీపేట్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, రాయ‌న‌పాడు, ఏలూరు, రాజ‌మండ్రి, అన‌ప‌ర్తి, సామ‌ల్‌కోట్‌, అన్న‌వ‌రం, తుని, య‌ల‌మంచిలి, అన‌కాప‌ల్లి, దువ్వాడ‌, పెందుర్తి, కొత్త‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి స్టేష‌న్ల‌లో ఆగ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement