త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

Traffic Restrictions | ఈ నెల 10న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో పోలీసులు అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప‌రేండ్ గ్రౌండ్‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు మోదీ హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో ప‌రేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఏరియాల్లో మ‌ల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

S

Hyderabad | Published On May 9, 2026, 4.15 pm IST

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. రేపు సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 10న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో పోలీసులు అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప‌రేండ్ గ్రౌండ్‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు మోదీ హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో ప‌రేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఏరియాల్లో మ‌ల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు వీవీఐపీ, వీఐపీల రాక‌పోక‌లు సాగే అవ‌కాశం ఉన్నందున.. ప‌రేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌న్నారు. ఈ స‌మ‌యంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు సొంత వాహ‌నాల్లో కాకుండా మెట్రో రైలు, ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉప‌యోగించుకుంటే మంచిద‌ని సూచించారు. రోడ్ల‌పై ఎక్క‌డంటే అక్క‌డ వాహ‌నాల‌ను పార్క్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. త‌దిత‌ర వివ‌రాల కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబ‌ర్ 8712662999 కాల్ చేయొచ్చు.

Advertisement
Advertisement