Sankranti Rush | పల్లె బాట పట్టిన పట్నం వాసులు.. ఆ హైవేపై భారీగా ట్రాఫిక్.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తే బెటర్!
Sankranti Rush | స్కూళ్లు, విద్యా సంస్థలకు సంక్రాంతి (Sankranti Rush) సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో పట్నం వాసులు పల్లెల బాట పట్టారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.
త్రినేత్ర.న్యూస్: స్కూళ్లు, విద్యా సంస్థలకు సంక్రాంతి (Sankranti Rush) సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో పట్నం వాసులు పల్లెల బాట పట్టారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద 3 సెకన్లకు ఒక వాహనం చొప్పున వెళ్లేలా ఏర్పాట్లు చేసినా.. రద్దీ తగ్గటం లేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు విజయవాడ హైవేకు బదులుగా భువనగిరి మీదుగా ప్రయాణించాలని తెలిపారు. భువనగిరి, రామన్నపేట మీదుగా ప్రయాణించి నేరుగా చిట్యాలకు చేరుకోవచ్చని, అక్కడి నుంచి నార్కట్‌పల్లిని దాటేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని సూచించారు.
గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు పోలీసులు ప్రత్యేక సూచన చేశారు. సాధారణంగా వీరంతా నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారి మీదుగా వెళ్తుంటారు. దీనికి బదులుగా హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లడం మంచిదని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ప్రయాణించే వారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చని, ఇది కొంచెం ఎక్కువ దూరమైనప్పటికీ.. ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లొచ్చని తెలిపారు.
ఇక హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ మీదుగా వచ్చి ఘట్‌కేసర్ వద్ద ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చని, అదేవిధంగా సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చని వెల్లడించారు. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం ద్వారా సమయాన్ని భారీగా తగ్గించగలవని ట్రాఫిక్ పోలీసులు సూఇంచారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






