త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangareddy | కారులో చెల‌రేగిన అగ్నికీల‌లు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌యాణికులు

Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని స‌దాశివ‌పేట‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఘోరం జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారి 65పై వేగంగా వెళ్తున్న కారులో నందికంది వ‌ద్ద ఆక‌స్మాత్తుగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి.

S

Telangana | Published On Mar 4, 2026, 3.36 pm IST

Sangareddy | కారులో చెల‌రేగిన అగ్నికీల‌లు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌యాణికులు
Advertisement

Sangareddy | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలోని స‌దాశివ‌పేట‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఘోరం జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారి 65పై వేగంగా వెళ్తున్న కారులో నందికంది వ‌ద్ద ఆక‌స్మాత్తుగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్.. కారును ర‌హ‌దారి ప‌క్క‌కు ఆపాడు. క్ష‌ణాల్లోనే కారులో ఉన్న వారంతా కింద‌కు దిగారు. ఈ ప్ర‌మాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేసింది. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా ఎన్‌హెచ్ 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Advertisement
Advertisement