త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mist air cooling system | చ‌ల్ల చ‌ల్ల‌గా.. డ్యూటీ హాయిగా

Mist air cooling system | ఎండ వేడిమి నుంచి వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు జాయింట్ ట్రాఫిక్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్(Joyal davis) వినూత్న ఆలోచ‌న చేశారు. ట్రాఫిక్ బూత్‌లలో నీటి తుంప‌ర్లు ప‌డేలా ‘మిస్ట్‌ ఎయిర్‌ కూలింగ్‌ సిస్టం’ను ఏర్పాటు చేశారు. డీజీపీ కార్యాలయం ఎదురుగా రవీంద్రభారతి (Ravindra Bharathi) కూడలిలోని ఓ బూత్‌లో ప్రయోగాత్మకంగా అమర్చారు.

S

News | Published On Apr 24, 2026, 5.06 pm IST

Mist air cooling system | చ‌ల్ల చ‌ల్ల‌గా.. డ్యూటీ హాయిగా
Advertisement

Mist air cooling system | త్రినేత్ర‌.న్యూస్‌: వేస‌వి వ‌చ్చిందంటే చాలు ఇంటి నుంచి బ‌య‌టి వెళ్లాలంటే సాహ‌స‌మే చేయాలి. ఇక రోడ్ల‌పై మండుటెండల్లో రోజంతా విధులు నిర్వ‌హించే ట్రాఫిక్‌ సిబ్బంది ప‌రిస్థితి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారికి పెద్ద స‌వాలే ఎదుర‌వుతుంటుంది. అయితే ఈ ఎండ వేడిమి నుంచి వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు జాయింట్ ట్రాఫిక్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్(Joyal davis) వినూత్న ఆలోచ‌న చేశారు. ట్రాఫిక్ బూత్‌లలో నీటి తుంప‌ర్లు ప‌డేలా ‘మిస్ట్‌ ఎయిర్‌ కూలింగ్‌ సిస్టం’ను ఏర్పాటు చేశారు. డీజీపీ కార్యాలయం ఎదురుగా రవీంద్రభారతి (Ravindra Bharathi) కూడలిలోని ఓ బూత్‌లో ప్రయోగాత్మకంగా అమర్చారు.

10 లీటర్ల వాటర్‌ క్యాన్‌కు పైపులు బిగించి చిన్న మోటారు సాయంతో నీటి తుంపర్లు బూత్‌లో నలువైపులా చిమ్మేలా చేశారు. దీని ఏర్పాటుపై అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న‌ట్రాఫిక్‌ సిబ్బంది సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉంద‌ని వారు తెలిపారు. ఈ నేప‌థ్యంలో నగరంలోని 100కు పైగా ట్రాఫిక్‌ బూత్‌లలో ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా ఎండ వేడిమి ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ప్రాధాన్య క్ర‌మంలో ఏర్పాటు చేయాల‌ని న‌గ‌ర‌వాసులు కోరుతున్నారు.

Advertisement
Advertisement