త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sankranthi Holidays 2026 | విద్యా సంస్థ‌ల‌కు సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఎప్పుడంటే..?

Sankranthi Holidays 2026 | హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. సంక్రాంతి పండుగ‌ నేప‌థ్యంలో సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. జ‌న‌వ‌రి 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ‌ను నిర్వ‌హించ‌నుండ‌గా, జ‌న‌వ‌రి 10 నుంచి 16వ తేదీ వ‌ర‌కు పండుగ సెలవులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

S

Telangana | Published On Jan 6, 2026, 8.35 am IST

Sankranthi Holidays 2026 | విద్యా సంస్థ‌ల‌కు సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఎప్పుడంటే..?
Advertisement

Sankranthi Holidays 2026 | హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. సంక్రాంతి పండుగ‌ నేప‌థ్యంలో సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. జ‌న‌వ‌రి 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ‌ను నిర్వ‌హించ‌నుండ‌గా, జ‌న‌వ‌రి 10 నుంచి 16వ తేదీ వ‌ర‌కు పండుగ సెలవులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర పాఠ‌శాల విద్యా డైరెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, వాణిజ్య పాఠ‌శాల‌ల‌కు ఈ సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది.

జ‌న‌వ‌రి 16వ తేదీన క‌నుమ పండుగ సంద‌ర్భంగా ఐచ్ఛిక సెల‌వు (ఆప్ష‌న‌ల్ హాలిడే) ఇస్తున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. క‌నుమ రోజున రైతులు ప్ర‌త్యేకంగా పండుగ‌ను జ‌రుపుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. కొత్త ధాన్యం ఇంటికి వ‌స్తుంది. ఇల్లంతా సంద‌డిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే రైతులు క‌నుమ రోజున ఉత్స‌వాలు, పండుగ సంబురాలు నిర్వ‌హిస్తారు. ఇక జ‌న‌వ‌రి 17వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభం అవుతాయ‌ని తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement