త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju | 12 ఏండ్ల‌ తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు!

Sanjay Jaju | ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Deputation) కే. రామ‌కృష్ణారావు ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో త‌దుప‌రి సీఎస్ అవ‌రనే విష‌య‌మై ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్ర‌మంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు (Sanjay Jaju) తెలంగాణకు తిరిగి వ‌స్తున్నారు.

G

Telangana | Published On Jun 24, 2026, 6.33 am IST

Sanjay Jaju | 12 ఏండ్ల‌ తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు!
Advertisement

Sanjay Jaju | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Deputation) కే. రామ‌కృష్ణారావు ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో త‌దుప‌రి సీఎస్ అవ‌రనే విష‌య‌మై ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్ర‌మంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు (Sanjay Jaju) తెలంగాణకు తిరిగి వ‌స్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు ఆయనను తెలంగాణ కేడర్‌కు పంపేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 12 ఏండ్ల త‌ర్వాత ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల నుంచి రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌దుప‌రి సీఎస్‌గా ఆయ‌న‌నే నియ‌మించే అవ‌కాశం ఉన్న‌ట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్ల‌డించాయి.

జ‌యేశ్, వికాస్‌రాజ్‌ ఆశ‌ల‌పై నీళ్లు!

కాగా, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పదవి కోసం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్ అధికారులు అయిన జయేశ్‌ రంజన్‌ (పురపాలక శాఖ), వికాస్‌రాజ్‌ (ఆర్‌అండ్‌బీ) పోటీపడ్డారు. వారిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వమే సంజయ్‌ జాజును తెలంగాణ కేడర్‌కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో వారి ఆశ‌ల‌కు గండి ప‌డిన‌ట్లేన‌ని అధికారులు భావిస్తున్నారు.

12 ఏండ్లుగా కేంద్ర స‌ర్వీసుల్లో..

1992వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజ‌య్ జాజు.. 1969 ఫిబ్ర‌వ‌రి 26న జ‌న్మించారు. బీఈ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎంటెక్‌, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్, ఎంబీయే ఫైనాన్స్ చేశారు. ఇ-గ‌వ‌ర్నెన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, డిఫెన్స్ ప్రొడ‌క్ష‌న్‌, పౌర సేవ‌ల్లో సాంకేతిక వినియోగంలో నిపుణులు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌ జాజు జ.. అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

ఉమ్మడి రాష్ట్రంలో విజ‌య‌వాడ స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా, విశాఖ‌ప‌ట్నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్‌గా, హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (INCAP) వైస్ చైర్మన్, ఎండీగా, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ కమిషనర్‌గా ప‌నిచేశారు. ఐటీ ముఖ్యకార్యదర్శిగా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా విధులు నిర్వ‌హించారు. మీసేవ (MeeSeva) ప్రాజెక్టును రూపొందించి విజ‌య‌వంతంగా అమలు చేశారు. 350కి పైగా ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించే ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారింది. దీంతో నేషనల్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డ్ 2014 అందుకుంది. కాగా, తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌ ఆయన అక్టోబర్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement