త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rains | ప‌గ‌టి పూట భారీ ఉష్ణోగ్ర‌త‌లు.. రాత్రి పూట మోస్త‌రు వ‌ర్షాలు

Rains | రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. ప‌గ‌టి పూట 40 డిగ్రీల సెల్సియ‌స్‌కు చేరువ‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాత్రిపూట మాత్రం తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. 10 త‌ర్వాత ఎండ‌లు దంచికొడుతున్నాయి.

S

Hyderabad | Published On Jun 23, 2026, 7.10 pm IST

Rains | ప‌గ‌టి పూట భారీ ఉష్ణోగ్ర‌త‌లు.. రాత్రి పూట మోస్త‌రు వ‌ర్షాలు
Advertisement

Rains | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. ప‌గ‌టి పూట 40 డిగ్రీల సెల్సియ‌స్‌కు చేరువ‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాత్రిపూట మాత్రం తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. 10 త‌ర్వాత ఎండ‌లు దంచికొడుతున్నాయి.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచే న‌గ‌రంలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించిన‌ప్ప‌టికీ.. ఆకాశం మేఘావృత‌మై ఉన్నా వ‌ర్షం మాత్రం రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు కుర‌వ‌లేదు. కానీ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా మోస్త‌రు వ‌ర్షం కురిసింది. దీంతో మంగ‌ళ‌వారం పొద్దున చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

అయితే ఈ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఎక్కువ స‌మ‌యం ఉండ‌లేదు. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి 40 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు చేరాయి. అనేక ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌య్యాయి. టీడీపీఎస్ ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున కురిసిన వ‌ర్షానికి అత్య‌ధికంగా ఆర్‌సీపురంలో 114.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

రాబోయే 24 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నగరంలో ఉష్ణోగ్రతలు 24 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement