Portugal vs Uzbekistan | పోర్చుగల్‌కు తొలి విజయం
Portugal vs Uzbekistan | ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో చెలరేగడంతో మ్యాచ్‌ను 5-0 తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నాకౌట్ చేరే అవకాశాలను బలోపేతం చేసుకున్నది.
- ఉబ్జెకిస్తాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం
- రొనాల్డో డబుల్ ధాటికి చిత్తయిన జట్టు
- నాకౌట్‌కు చేరువైన జట్టు
- ఇంటిబాట పట్టిన ఉబ్జెకిస్తాన్
Portugal vs Uzbekistan | ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో చెలరేగడంతో మ్యాచ్‌ను 5-0 తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నాకౌట్ చేరే అవకాశాలను బలోపేతం చేసుకున్నది.
రొనాల్డో మెరుపులు..
గత మ్యాచ్‌లో ఒక్క గోల్ చేయలేకపోయిన రొనాల్డో ఈ మ్యాచ్‌లో తొలి నిమిషాల నుంచే దూకుడు ప్రదర్శించాడు. మ్యాచ్ ఆరో నిమిషంలోనే తొలి గోల్ సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసే ముందు 39వ నిమిషంలో మరో గోల్ కొట్టి తన జట్టుకు పటిష్ట ఆధిక్యాన్ని అందించాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో పోర్చుగల్ తరఫున వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, ఆరు వేర్వేరు వరల్డ్‌కప్‌లో గోల్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆనందంలో రొనాల్డో
మ్యాచ్ ముగిసిన వెంటనే రొనాల్డో ఆనందోత్సాహాలతో మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీ వైపు వెళ్లి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో తన సిగ్నేచర్ స్టయిల్‌లో నిలబడి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ “వీ ఆర్ బ్యాక్” అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ విజయం రొనాల్డోతో పాటు పోర్చుగల్‌కు కూడా ఎంతో కీలకం. టోర్నీలో తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో 1-1తో డ్రాగా ముగించుకున్న పోర్చుగల్, ఉజ్బెకిస్తాన్‌పై మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారీ విజయం సాధించింది.
మ్యాచ్ ఇలా..
రొనాల్డో రెండు గోల్స్‌తో మెరువగా.. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ తరఫున నునో మెండెస్, రఫాయెల్ లియావో తలో గోల్ సాధించారు. మరో గోల్ ఉజ్బెకిస్తాన్ ఆటగాడు నెమాటోవ్ చేసిన ఓన్‌గోల్ రూపంలో మరో పాయింట్ వచ్చింది. దాంతో స్కోర్ 5కి పెరిగింది. ఈ పరాజయంతో ఉజ్బెకిస్తాన్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు రెండు మ్యాచుల్లో ఒక విజయం, ఒక డ్రాతో నాలుగు పాయింట్లు సాధించిన పోర్చుగల్ గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరి నాకౌట్ బెర్త్‌కు మరింత చేరువైంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
- ●Preity Mukhundhan | ఓటీటీలోకి ప్రీతిముకుందన్ మూవీ.. రేపటి నుంచి బ్లాస్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- ●Shruti Haasan | అప్పుడు నాన్నకు బాగా కోపం వచ్చింది.. చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్న శ్రుతి హాసన్
- ●Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్‌ఇంజిన్లతో అదుపులోకి..
- ●Panama Vs Croatia | పనామాపై క్రొయేషియా విక్టరీ
- ●Ambedkar Open University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు

Preity Mukhundhan | ఓటీటీలోకి ప్రీతిముకుందన్ మూవీ.. రేపటి నుంచి బ్లాస్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Shruti Haasan | అప్పుడు నాన్నకు బాగా కోపం వచ్చింది.. చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్న శ్రుతి హాసన్

Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్‌ఇంజిన్లతో అదుపులోకి..



