త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Himayat Sagar | హిమాయ‌త్ సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద‌.. అప్ర‌మ‌త్త‌మైన జ‌ల‌మండ‌లి

Himayat Sagar | ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ శివారులో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్( Himayat Sagar ) జలాశ‌యానికి వ‌ర‌ద పోటెత్తింది. సోమ‌వారం ఉద‌యం నుంచి వ‌ర‌ద జ‌లాలు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో జ‌ల‌మండ‌లి( Jalamandali ) అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

S

Hyderabad | Published On Jun 23, 2026, 7.25 pm IST

Himayat Sagar | హిమాయ‌త్ సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద‌.. అప్ర‌మ‌త్త‌మైన జ‌ల‌మండ‌లి
Advertisement

Himayat Sagar | త్రినేత్ర‌.న్యూస్ : ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ శివారులో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్( Himayat Sagar ) జలాశ‌యానికి వ‌ర‌ద పోటెత్తింది. సోమ‌వారం ఉద‌యం నుంచి వ‌ర‌ద జ‌లాలు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో జ‌ల‌మండ‌లి( Jalamandali ) అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వ‌ర‌ద ప‌రిస్థితిని అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడూ అంచ‌నా వేస్తూ దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

వ‌ర‌ద ఉధృతి ఎక్కువైతే సాగ‌ర్ నుంచి దిగువ‌కు నీటిని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో దిగువ ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాలు, ఇత‌ర అధికార బృందాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీరు చేరుతున్న నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు. దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అప్ర‌మ‌త్తం చేయాల‌ని, అవ‌స‌ర‌మైతే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని చెప్పారు.

Advertisement
Advertisement