Ukraine Army Of Witches | రష్యన్లకు వల వేస్తున్న ‘మంత్రగత్తెల ఆర్మీ’.. హనీట్రాప్‌తో అంతుచూస్తున్న ఉక్రెయిన్ మాస్టర్ మైండ్!
రష్యా సైనికులను మాయ మాటలతో బురిడీ కొట్టించి వారి అంతుచూస్తున్నారు ఉక్రెయిన్ మహిళలు. 'మంత్రగత్తెల ఆర్మీ'గా పిలిచే ఈ సీక్రెట్ ఆపరేషన్ల అసలు కథేంటంటే?
International | Published On Jun 24, 2026, 4.00 am IST
- ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పుడు ఉక్రెయిన్ మహిళలు (Vidmas) సైలెంట్ వెపన్స్‌గా మారారు
- ఆన్‌లైన్‌లో ఫేక్ అకౌంట్లతో రష్యన్ సైనికులకు వల వేసి, మాటల్లో పెట్టి వారి లొకేషన్ వివరాలు రాబడుతున్న వైనం
- కోఆర్డినేట్స్ అందిన కేవలం 15 నిమిషాల్లోనే రష్యన్ క్యాంపులపై విరుచుకుపడుతున్న డ్రోన్ దాడులు
- రష్యన్ సైనికుల్లో భయాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 60 వేల మందికి పైగా మహిళలకు ఇంటెలిజెన్స్ శిక్షణ
Ukraine Army Of Witches | త్రినేత్ర.న్యూస్ : గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia War) మధ్య జరుగుతున్న యుద్ధంలో రోజురోజుకూ వ్యూహాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు తుపాకులు, ట్యాంకర్లతో ప్రత్యక్షంగా సాగిన పోరాటం.. ఇప్పుడు వాట్సప్ చాట్‌లు, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫేక్ ఆన్‌లైన్ అకౌంట్ల (Online fake accounts) రూపంలో 'షాడో వార్'గా మారిపోయింది. ఈ కొత్త తరహా ఇంటెలిజెన్స్ వార్‌లో ఉక్రెయిన్ మహిళలు.. రష్యన్ సైనికుల పాలిట మృత్యుదేవతలుగా మారారు.
ఫేక్ ప్రొఫైల్స్.. రియల్ అటాక్స్
రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ఓ రష్యన్ సైనికుడు, ఒంటరిగా ఉన్న ఓ 'ఉక్రెయిన్ గృహిణి'తో ఆన్‌లైన్‌లో ప్రేమలో పడ్డాడు. నెలల తరబడి ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో "నువ్వు ఎక్కడుంటున్నావ్? ఆ ప్లేస్ ఎలా ఉందో చూడాలని ఉంది" అని ఆ మహిళ అడగగానే.. గుడ్డిగా నమ్మేసిన ఆ సైనికుడు తన మిలిటరీ బేస్ (Military base) ఫోటోను పంపాడు. ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో రష్యన్ క్యాంపు మ్యాప్ స్పష్టంగా కనిపించింది.
అంతే! ఆ ఫోటో వెళ్లిన కాసేపటికే ఆ రష్యన్ క్యాంపుపై డ్రోన్ స్ట్రైక్ (Drone strike) జరిగింది. నిజానికి ఆ సైనికుడు ఇన్ని రోజులు మాట్లాడింది ఓ గృహిణితో కాదు.. ఆమె పేరుతో ఛాట్ చేసిన ఓ ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌తో! ఇలాంటి హనీట్రాప్ (Honeytrap) ఆపరేషన్లు ఇప్పుడు ఉక్రెయిన్‌లో సర్వసాధారణంగా మారాయి.
ఎవరీ 'విద్మా' (Vidma)?
ఉక్రెయిన్ మిలిటరీ పరిభాషలో ఈ మహిళా సీక్రెట్ ఏజెంట్లను కమాండర్లు 'విద్మా' (మంత్రగత్తె) అని పిలుస్తుంటారు. ఉక్రెయిన్ జానపద కథల ప్రకారం విద్మా అంటే 'ఇతరులకు తెలియని రహస్యాలు తెలిసిన మహిళ' అని అర్థం.
ప్రతిరోజూ ఉదయం షాపింగ్‌కు వెళ్లే సాధారణ మహిళల్లా, ఆసుపత్రుల్లో నర్సుల్లా, స్కూళ్లలో టీచర్లలా రష్యన్ చెక్‌పోస్టుల గుండా వెళ్తూ రష్యన్ల కదలికలను వీరు పసిగడతారు. అక్కడ చూసిన ప్రతి చిన్న విషయాన్ని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తుంటారు. "మగవాళ్లు వెళ్లలేని ఎన్నో ప్రదేశాలకు వీరు సులువుగా వెళ్లగలరు. దొరికితే ప్రాణాలు పోతాయని తెలిసినా అత్యంత ధైర్యంగా వీరు పనిచేస్తున్నారు" అని మారియుపోల్ ప్రతిఘటన దళం కమాండర్ పెట్రో ఆండ్రియుష్చెంకో తెలిపారు.
15 నిమిషాల్లోనే అటాక్
ఖేర్సన్ (Kherson) ప్రాంతానికి చెందిన రోక్సానా లాంటి మహిళలు ఇప్పుడు విదేశాల నుంచి ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌కు కోఆర్డినేట్స్ (Coordinates) కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు, భవనాలపై వాళ్లకున్న అవగాహనతో రష్యన్ ఆయుధ కర్మాగారాలను పసిగడుతున్నారు. ఇలా ఏజెంట్ల ద్వారా సమాచారం అందిన కేవలం 15 నిమిషాల్లోనే ఉక్రెయిన్ డ్రోన్లు ఆయా లక్ష్యాలను నాశనం చేస్తున్నాయి.
శత్రువుకు నిద్రలేకుండా
"రష్యన్ సైనికుడు ఎప్పుడు బయటకు వచ్చినా వాడిలో భయం కనిపించాలి. మార్కెట్లో కనిపించే బామ్మను చూసినా, బస్సు డ్రైవర్‌ను చూసినా, ఆసుపత్రిలో డాక్టర్‌ను చూసినా తన మరణం వాళ్ల రూపంలో వస్తుందేమోనన్న అనుమానంతో వాడు బతకాలి. ఆ భయమే వారికి మేము ఇచ్చే శిక్ష" అని మారియుపోల్‌లో పనిచేస్తున్న 'సెస్ర్తా' అనే కోడ్ నేమ్ ఉన్న ఓ ఉక్రెయిన్ ఏజెంట్ (Secret Agent) తెలిపారు.
ఇప్పటికే 'ఉక్రెయిన్ ఉమెన్స్ గార్డ్' ఆధ్వర్యంలో సుమారు 60,000 మందికి పైగా మహిళలు ప్రాణరక్షణ, మిలిటరీ వ్యూహాల్లో శిక్షణ పొందారు. "ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ మగవాళ్లు అయిపోతే ఏంటి పరిస్థితి?" అని చాలామంది అడుగుతుంటారు. "అదే జరిగితే, మా మహిళలు రంగంలోకి దిగుతారు.. అప్పుడు ఒక్క రష్యన్ సైనికుడు కూడా ప్రాణాలతో మిగలడు" అని ఉక్రెయిన్ మాజీ ఎంపీ లెసియా ఒరోబెట్స్ స్పష్టం చేశారు.
Video of a Ukrainian woman confronting a Russian soldier: "Take some seeds, put them in your pockets. So at least sunflowers will grow when you die here." pic.twitter.com/hwnLtORPAk
— Peter Liakhov (@peterliakhov) February 25, 2022
తాజావార్తలు
- ●Bengaluru Auto Scam | బెంగళూరులో 'ఆటో' దౌర్జన్యం.. అమాయక యువకులపై దాడి చేసి డబ్బుల వసూలు! చివరగా పట్టించిన యూపీఐ
- ●India Oil Imports | అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్: హార్ముజ్ దాటిన క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఎరువులతో వస్తున్న 11 భారత నౌకలు
- ●Trisha | స్పెషల్ ఫొటోతో సీఎం విజయ్‌కి విషెస్ చెప్పిన త్రిష - బ్రేకప్ రూమర్లపై చెన్నై క్వీన్ రియాక్షన్ అదుర్స్
- ●Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి
- ●Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?
- ●Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు

Bengaluru Auto Scam | బెంగళూరులో 'ఆటో' దౌర్జన్యం.. అమాయక యువకులపై దాడి చేసి డబ్బుల వసూలు! చివరగా పట్టించిన యూపీఐ

India Oil Imports | అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్: హార్ముజ్ దాటిన క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఎరువులతో వస్తున్న 11 భారత నౌకలు

Trisha | స్పెషల్ ఫొటోతో సీఎం విజయ్‌కి విషెస్ చెప్పిన త్రిష - బ్రేకప్ రూమర్లపై చెన్నై క్వీన్ రియాక్షన్ అదుర్స్

Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి



