త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Englad Vs Ghana | త‌డ‌బడిన‌ ఇంగ్లండ్‌

Englad Vs Ghana | క్రొయేషియాపై అద్భుత విజయంతో జోరు మీద కనిపించిన ఇంగ్లండ్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌లో రెండో మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఘానాతో బోస్టన్‌లో జరిగిన గ్రూప్‌ దశ పోరులో గోల్‌ చేయలేకపోయిన ఇంగ్లండ్‌ 0-0తో డ్రాకు పరిమితమైంది. దాంతో కీల‌క టోర్నీల్లో రెండో మ్యాచ్‌లో విజయం సాధించలేని జ‌ట్టుగా ఇంగ్లండ్‌ చెత్త రికార్డును నిల‌బెట్టుకుంది.

P

Sports | Published On Jun 24, 2026, 6.49 am IST

Englad Vs Ghana | త‌డ‌బడిన‌ ఇంగ్లండ్‌
Advertisement
  • - ఘ‌నాతో మ్యాచ్ డ్రా
  • ఒక్క గోల్ వేయ‌లేక‌పోయిన రెండుజ‌ట్లు
  • వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో ఘ‌నాకు ఎదురుదెబ్బ‌
  • అవ‌కాశాలు వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయినా బ్రిటిష్ జ‌ట్టు

Englad Vs Ghana | క్రొయేషియాపై అద్భుత విజయంతో జోరు మీద కనిపించిన ఇంగ్లండ్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌లో రెండో మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఘానాతో బోస్టన్‌లో జరిగిన గ్రూప్‌ దశ పోరులో గోల్‌ చేయలేకపోయిన ఇంగ్లండ్‌ 0-0తో డ్రాకు పరిమితమైంది. దాంతో కీల‌క టోర్నీల్లో రెండో మ్యాచ్‌లో విజయం సాధించలేని జ‌ట్టుగా ఇంగ్లండ్‌ చెత్త రికార్డును నిల‌బెట్టుకుంది. 2018 వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటివరకు ప్రధాన టోర్నీల్లో రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. యూరో 2020లో స్కాట్లాండ్‌తో, 2022 వరల్డ్‌కప్‌లో అమెరికాతో, 2024 యూరోస్‌లో కూడా డ్రాలతోనే సరిపెట్టుకుంది. తాజాగా ఘానాపై కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.

ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించినా ఫ‌లితం శూన్యం

మ్యాచ్‌ ఆరంభం నుంచే బంతిపై ఇంగ్లండ్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 78 శాతం బంతి నియంత్రణ తమవైపు ఉంచుకున్న త్రీ లయన్స్‌ జట్టు మొత్తం 19 షాట్లు ప్రయత్నించగా.. అందులో మూడు మాత్రమే లక్ష్యాన్ని చేరాయి. మరోవైపు ఘానా ఒక్క షాట్‌తోనే సరిపెట్టుకుంది. అయితే, గణాంకాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఘానా డిఫెన్స్‌ను ఛేదించడంలో జట్టు పూర్తిగా విఫలమైంది. తక్కువ సంఖ్యలో ఆటగాళ్లతో క‌ట్టుదిట్ట‌మైన డిఫెన్స్‌తో ఇంగ్లండ్ ఎటాకింగ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్న‌ది.

ఫ‌లించ‌ని వ్యూహాలు

హ్యారీ కేన్‌కు మద్దతుగా ఆంథోనీ గోర్డన్‌, నోనీ మడూకేలను వింగ్స్‌లో దింపిన కోచ్‌ థామస్‌ టూచెల్‌ వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వింగ్స్‌ నుంచి సరైన అవకాశాలు సృష్టించలేకపోవడంతో కేన్‌ ఎక్కువసేపు ఒంటరిగా కనిపించాడు. హైడ్రేషన్‌ బ్రేక్‌ సమయంలో చిన్న పాస్‌లతో ఆడుతూ, తర్వాత పొడవైన పాస్‌లతో ఘానా డిఫెన్స్‌ను దెబ్బ‌కొట్టాల‌ని టూచెల్‌ సూచించినా ఆ ప్రణాళిక అమలు కాలేదు. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్క షాట్‌ను కూడా గోల్‌పోస్ట్‌ వైపు పంపలేకపోవడం ఇదే తొలిసారి.

వివాదాస్పద నిర్ణయాలు

రెండో అర్ధభాగంలో ఘానాకు రెండు కీలక అవకాశాలు లభించినప్పటికీ, రిఫరీ నిర్ణయాలు వారి ఆశలను దెబ్బతీశాయి. 68వ నిమిషంలో ఘానా కౌంటర్‌ అటాక్‌కు వెళ్లిన సమయంలో గోల్‌కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డ్‌, ప్రిన్స్‌ అడూ ఒకరినొకరు ఢీకొనగా ఫౌల్‌ను ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఇచ్చారు. 80వ నిమిషంలో అడూను అడ్డుకునే క్రమంలో ఇంగ్లండ్‌ డిఫెండర్‌ చేసిన టాకిల్‌ పెనాల్టీగా కనిపించినప్పటికీ.. రిఫరీతో పాటు వీఏఆర్‌ కూడా స్పందించలేదు. దీంతో ఘానా శిబిరంలో అసంతృప్తి వ్యక్తమైంది. మ్యాచ్‌ ముగియడానికి మూడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశం వ‌చ్చింది. ఓ'రైలీ కొట్టిన షాట్‌ పోస్ట్‌ను తాకి తిరిగి రావడంతో బంతి హ్యారీ కేన్‌ వద్దకు చేరింది. అయితే, బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్ల‌కుండా ప్రేక్షకుల గ్యాలరీలోకి వెళ్లిపోయింది.

గ్రూప్‌లో అగ్రస్థానంలో ఇంగ్లండ్‌, ఘానా

ఈ డ్రాతో ఇంగ్లండ్‌, ఘానా జట్లు చెరో నాలుగు పాయింట్లతో గ్రూప్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో జూన్‌ 27న పనామాతో తలపడనుంది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ హ్యారీ కేన్‌ మాట్లాడుతూ “ఇలాంటి మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉంటాయి. కొంత నాణ్యత లోపించింది. ప్రారంభంలోనే గోల్‌ వచ్చి ఉంటే మ్యాచ్‌ స్వరూపం మారేది. అయినప్పటికీ చివర్లో కొన్ని అవకాశాలు రాబ‌ట్ట‌గ‌లిగామ‌ని” అని వ్యాఖ్యానించాడు.

Advertisement
Advertisement