Mother-in-law | భార్యాభర్తల మధ్య గొడవ.. సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై అల్లుడి లైంగికదాడి
Mother-in-law | వారు భార్యాభర్తలు. గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కూతరు, అల్లుడికి నచ్చచెప్పేందుకు అత్త (Mother-in-law) వారి ఇంటికి వెళ్లింది. అయితే దీనికంతటికీ నువ్వే కారణం అంటూ.. భార్యను గదిలో బంధించి.. అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Mother-in-law | త్రినేత్ర.న్యూస్: వారు భార్యాభర్తలు. గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కూతరు, అల్లుడికి నచ్చచెప్పేందుకు అత్త (Mother-in-law) వారి ఇంటికి వెళ్లింది. అయితే దీనికంతటికీ నువ్వే కారణం అంటూ.. భార్యను గదిలో బంధించి.. అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి సంగారెడ్డి (Sangareddy) జిల్లా వట్‌పల్లి మండలం ఖదీరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖదీరాబాద్‌కు చెందిన భార్యాభర్తల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త రోజూ తాగివచ్చి లొల్లి పెట్టుకుంటున్నాడని భార్య తన తల్లికి చెప్పుకున్నది. దీంతో వారికి సర్దిచెబుదామని భార్య తల్లి ఈ నెల 7న కుమార్తె ఇంటికి వచ్చింది.
మద్యం తాగి వచ్చిన భర్త.. భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. అయితే అక్కడే ఉన్న అత్త అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు తమ మధ్య గొడవకు నువ్వే కారణమంటూ.. భార్యను ఓ గదిలో బంధించాడు. అత్తను మరో గదిలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జోగిపేట పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






