త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saleem Pasha | టీజేఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా సయ్యద్ సలీమ్ పాషా

Saleem Pasha | తెలంగాణ జ‌న స‌మితి (TJS) పార్టీ అధికార ప్ర‌తినిధిగా స‌య్య‌ద్ స‌లీమ్ పాషా (Saleem Pasha) నియ‌మితుల‌య్యారు.ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Professor Kodandaram) ప్ర‌క‌టించారు.

G

Telangana | Published On Oct 8, 2026, 6.23 am IST

Saleem Pasha | టీజేఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా సయ్యద్ సలీమ్ పాషా
Advertisement

Saleem Pasha | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ జ‌న స‌మితి (TJS) పార్టీ అధికార ప్ర‌తినిధిగా స‌య్య‌ద్ స‌లీమ్ పాషా (Saleem Pasha) నియ‌మితుల‌య్యారు.ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Professor Kodandaram) ప్ర‌క‌టించారు. మొత్తం 24 మందితో టీజేఎస్ పార్టీ నూతన రాష్ట్ర కమిటీని నియ‌మించారు. ఇందులో భాగంగా సయ్యద్ సలీమ్ పాషను పార్టీ అధికార ప్రతినిధిగా (Spokesperson) నియమించారు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ (OU JAC) నేతగా సలీమ్ పాషా కీలక పాత్ర పోషించారు. ఆచార్య‌ కోదండరాం శిష్యుడిగా మన్ననలు పొందారు. 2018లో తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీలోని యువజన విభాగంలో కీలక పాత్ర పోషించారు.‌ పార్టీ తరఫున వివిధ ప్రజా సమస్యలపై, ముఖ్యంగా నిరుద్యోగ యువత, రైతుల సమస్యలపై గళమెత్తారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రక్రియల్లో జరుగుతున్న మార్పులు, అక్రమాలపై అఖిలపక్షాలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో టీజేఎస్ పార్టీ తరఫున సలీమ్ పాషా చురుకైన పాత్ర పోషించారు.

Advertisement
Advertisement