త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | 15 నుంచి రైతు భ‌రోసా రెండో విడుత నిధులు విడుద‌ల‌..!

Rythu Bharosa | రాష్ట్రంలో రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. రెండో విడుత నిధుల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 15వ తేదీన రైతు భ‌రోసా రెండో విడుత నిధుల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

S

Telangana | Published On Apr 12, 2026, 11.54 am IST

Rythu Bharosa | 15 నుంచి రైతు భ‌రోసా రెండో విడుత నిధులు విడుద‌ల‌..!
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. రెండో విడుత నిధుల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 15వ తేదీన రైతు భ‌రోసా రెండో విడుత నిధుల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కొత్తగా భూములు కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు ప్రాధాన్యత ల‌భించ‌నుంది. రెండో విడుతలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి విడతలో దాదాపు 70 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 3,590 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఇక చివ‌రి విడుత నిధుల‌ను ఏప్రిల్ నెలాఖరు నాటికి అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఏప్రిల్ నాటికి రైతు భ‌రోసా నిధుల విడుద‌ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement