త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్ నియామ‌కం

Bonthu Rammohan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ నియమితులయ్యారు.

S

Telangana | Published On Sep 25, 2026, 1.38 pm IST

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్ నియామ‌కం
Advertisement

Bonthu Rammohan | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి బొంతు రామ్మోహన్ ఈ సంద‌ర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రామిక వర్గం, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కార్మికుల సుదీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థి నాటి నుండి పోరాటాల అనుభవం ఉన్న బొంతు రామ్మోహన్ నాయకత్వంలో జలమండలి ఎన్నికల్లో గెలిచిన విధంగానే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు రాబోయే యూనియన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం అని అన్నారు.

అనంత‌రం బొంతు రామ్మోహన్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు, ఉద్యోగ భద్రతకు, మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు యూనియన్ నాయకులను సమన్వయం చేసుకుంటూ నిరంతరం శ్రమిస్తాను. రాబోయే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం భారీ మెజారిటీ తో గెలుస్తుంది. అందుకు ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసి ముందుకు వెళ్తాం.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి, జనరల్ TMU సెక్రెటరీ అశ్వత్థామ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, విస్తృత స్థాయి ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement