NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..
NSE Share Price | గత సెషన్‌లో దాదాపు 2 శాతం లాభంతో ముగిసిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు శుక్రవారం స్వల్పంగా క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బీఎస్‌ఈలో ఇష్యూ ధరతో పోలిస్తే సుమారు 0.84 శాతం లాభంతో లిస్టయ్యింది. గత సెషన్‌లో బీఎస్‌ఈలో ఒక్కో షేర్ రూ.1,800 వద్ద లిస్టవగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ.1,790.10కు పడిపోయింది.
NSE Share Price | గత సెషన్‌లో దాదాపు 2 శాతం లాభంతో ముగిసిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు శుక్రవారం స్వల్పంగా క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బీఎస్‌ఈలో ఇష్యూ ధరతో పోలిస్తే సుమారు 0.84 శాతం లాభంతో లిస్టయ్యింది. గత సెషన్‌లో బీఎస్‌ఈలో ఒక్కో షేర్ రూ.1,800 వద్ద లిస్టవగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ.1,790.10కు పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు అర శాతం నష్టంతో కొనసాగింది. ఇటీవలి పతనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలను ఆశించే ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన ఎంట్రీ పాయింట్‌గా నిపుణులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ షేర్ ధర కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న ఇన్వెస్టర్ల కోసం షేర్ భవిష్యత్ పరిస్థితిపై నిపుణులు అభిప్రాయాలను వెల్లడించారు.
రూ.1950 ధర కీలకం..
కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అరుణ్ కేజ్రీవాల్ ప్రకారం ఈ షేర్‌కు రూ.1,950 వద్ద రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే రూ.1,785 కంటే దిగువకు వెళ్లే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. రూ.1,785 అనేది ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్. ఎన్‌ఎస్‌ఈ షేర్‌కు రూ.1,740 వద్ద స్టాప్ లాస్‌ను ఆయన సూచించారు. షేర్ తన యావరేజ్ వెయిటెడ్ ప్రైస్ కంటే దిగువన ముగిసిందని, అందువల్ల షేర్ ధర ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ కంటే దిగువకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది కొనుగోలు చేసే అవకాశంగా ఆయన అభివర్ణించారు. ఎన్‌ఎస్‌ఈ షేర్ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకునే స్టాక్‌గా మారుతుందని, దీర్ఘకాలంలో ఏటా 15 నుంచి 20 శాతం రాబడిని అందించే అవకాశం ఉందని, అయితే ఇది స్వల్పకాలిక ఇన్వెస్టర్ల కోసం కాదని తెలిపారు.
కఠినమైన స్టాప్ లాస్ ఉండాలి..
డౌన్‌సైడ్ ఎక్స్‌పోజర్‌ను క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్వల్పకాలిక, లిస్టింగ్ లాభాల కోసం పెట్టుబడి చేసే ఇన్వెస్టర్లు రూ.1,740 వద్ద కఠినమైన స్టాప్ లాస్‌ను కొనసాగించాలని సూచిస్తున్నామని అన్నారు. ఇది ఇష్యూ ధర కంటే సుమారు 2.5 శాతం తక్కువ అని, షేర్ ధర స్థిరపడుతున్న కొద్దీ ఈ స్టాప్ లాస్‌ను పైకి సవరించవచ్చని అన్నారు. అలాగే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వాల్యూమ్ ఆధారిత ఒడిదుడుకులను తట్టుకుని షేర్‌ను కొనసాగించడం ద్వారా ఎక్స్ఛేంజ్ వ్యాపారంలో ఉన్న నిర్మాణాత్మక దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ వెల్త్ హెడ్ శివాని న్యాతి తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం 10:23 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్ 0.70 శాతం నష్టంతో రూ.1,807.20 వద్ద ట్రేడయింది. ఆ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,47,480.00 కోట్లుగా ఉంది. ట్రేడింగ్‌లో షేర్ కనిష్ఠంగా రూ.1,790.10కు, గరిష్ఠంగా రూ.1,830కు చేరుకుంది.
ఐపీఓ ఇష్యూ ధర రూ.1,785తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ షేర్ 0.84 శాతం ప్రీమియంతో లిస్టయింది. ఐపీఓ లిస్టింగ్ అనంతరం గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ షేర్ ధర 4 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ఠం రూ.1,878కు చేరుకుంది. అయితే చివరికి రూ.1,818 వద్ద ముగిసింది.
తాజావార్తలు
- ●Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు
- ●ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ
- ●Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
- ●Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
- ●Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు

Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు

ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ

Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం

Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!






