Preeti Munde | మిస్ ఎర్త్ వాటర్ ఇండియాగా ఆదిలాబాద్ యువతి
Preeti Munde | ఆదిలాబాద్ (Adilabad) యువతికి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా- 2026 (Miss Earth Water India) కిరీటం దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్ల మండలం హీరాపూర్ (Hirapur) గ్రామానికి చెందిన ప్రీతి ముండే (Preeti Munde) 2026కుగాను మిస్ ఎర్త్ వాటర్ ఇండియాగా ఎంపికయ్యారు.
Preeti Munde | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్ (Adilabad) యువతికి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా- 2026 (Miss Earth Water India) కిరీటం దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్ల మండలం హీరాపూర్ (Hirapur) గ్రామానికి చెందిన ప్రీతి ముండే (Preeti Munde) 2026కుగాను మిస్ ఎర్త్ వాటర్ ఇండియాగా ఎంపికయ్యారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన జాతీయ అందాల పోటీల్లో తెలంగాణకు (Telangana) ప్రాతినిధ్యం వహించి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల్లో ఆమె చూపిన స్నేహపూర్వక ప్రవర్తన, మర్యాదలకు గుర్తింపుగా `మిస్ కంజీనియాలిటీ–2026` టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఈ టైటిల్ సాధించడం ద్వారా ఫిలిప్పీన్స్‌లో జరగబోయే అంతర్జాతీయ ‘మిస్ ఎర్త్` (global Miss Earth) పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఆమె ఎంపికయ్యారు. రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం నుంచి ప్రతిష్ఠాత్మక అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా కిరీటాన్ని గెలుచుకొని జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఉమా ముండే, ప్రహ్లాద్ ముండే కుమార్తె. తండ్రి ప్రహ్లాద్ స్థానికంగా బట్టల వ్యాపారం (cloth merchant) చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామానికి చెందిన ప్రీతి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ప్రగతి గ్రూప్ స్కూల్స్‌లో యోగా టీచర్‌గా (yoga teacher) సేవలందిస్తున్నారు. మాజీ ఎన్సీసీ (NCC) కేడెట్, జాతీయ స్థాయి యోగా క్రీడాకారిణి, జ్యోతిష్యురాలు (Astrologer), మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రీతి ప్రస్తుతం అరోరా యూనివర్సిటీలో యోగాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.
చదువు, అందాల పోటీలతో పాటు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్‌గా పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పాఠశాల పిల్లలకు వ్యర్థాల వర్గీకరణ, పర్యావరణ పరిశుభ్రత, చెరువుల పునరుద్ధరణ, మొక్కలు నాటే కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి ఆమె కైండ్ హార్ట్స్ (Kind Hearts) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన ప్రీతి ముండేను స్థానిక నాయకులు, జిల్లా అధికారులు, హీరాపూర్ గ్రామస్థులు అభినందించారు. అంతర్జాతీయ మిస్ ఎర్త్ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఆమె మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RRB NTPC | భారతీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నికల్ ఉద్యోగాలు.. RRB ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల
- ●Khairatabad Ganesh | ఆలస్యమవనున్న ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం
- ●Horoscope | సెప్టెంబర్ 25 రాశిఫలాలు.. ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం ఉంది!
- ●Pranay Murder Case Convict Dies | ప్రణయ్ పరువు హత్య కేసు: చర్లపల్లి జైలులో దోషి అబ్దుల్ బారి మృతి
- ●Tamannaah | బాలీవుడ్లో తమన్నా కెరీర్‌కు అగ్నిపరీక్ష
- ●Rajendranagar Murder Case | డ్రగ్స్ సమాచారం లీక్ చేస్తున్నాడనే కక్షతో స్నేహితుడిని పొడిచి చంపిన ఫ్రెండ్స్

RRB NTPC | భారతీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నికల్ ఉద్యోగాలు.. RRB ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల

Khairatabad Ganesh | ఆలస్యమవనున్న ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం

Horoscope | సెప్టెంబర్ 25 రాశిఫలాలు.. ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం ఉంది!

Pranay Murder Case Convict Dies | ప్రణయ్ పరువు హత్య కేసు: చర్లపల్లి జైలులో దోషి అబ్దుల్ బారి మృతి






