త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రాష్ట్రంలో అరాచక పాలన.. హౌస్ అరెస్టుపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్ర‌హం..

RS Praveen Kumar | రాష్ట్రంలో అరాచ‌క పాల‌న న‌డుస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డీజీపీ (DGP), హోమ్ మంత్రిని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Jul 18, 2026, 10.34 am IST

RS Praveen Kumar | రాష్ట్రంలో అరాచక పాలన.. హౌస్ అరెస్టుపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్ర‌హం..
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో అరాచ‌క పాల‌న న‌డుస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డీజీపీ (DGP), హోమ్ మంత్రిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌రూర్ న‌గ‌ర్‌లో జ‌రుగ‌నున్న యువ సంగ్రామ స‌దస్సుకు (Yuva Sangram Sadassu) వెళ్ల‌కుండా త‌న‌ను అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సభలో పాల్గొనడానికి తాను సిద్ధమవుతుండగా సైబరాబాద్ పోలీసులు శ‌నివారం ఉదయమే త‌న‌ను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. హైకోర్టు, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ నుంచి బహిరంగ సభ నిర్వహణకు రాతపూర్వక అనుమతులు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు నన్ను, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో (House Arrest) ఉంచడం రాజ్యాంగ విరుద్ధమ‌ని చెప్పారు.

రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, స్వేచ్ఛగా సంచరించే, మాట్లాడే ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ఒకవైపు 'సంవిధాన్ బచావో' అని నినదిస్తూ, మరోవైపు అదే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన సమాచారం లేదని వారు చెబుతున్నారన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇప్పటికే అనుమతి పత్రాలను అందజేసినా, పై అధికారుల ఆదేశాల పేరుతో పోలీసులు త‌మ‌ను అడ్డుకుంటున్నారని విమ‌ర్శించారు. బహిరంగ సభకు హాజరయ్యే అనుమతి లభించకపోతే, తాను ఖచ్చితంగా త‌న‌ నివాసంలోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు.

Advertisement
Advertisement