త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malla Reddy | పార్టీ మార‌డంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి.. వీడియో

Malla Reddy | మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి (Malla Reddy) పార్టీ మారుతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. తాను ఏ పార్టీలోకి వెళ్ల‌డం లేద‌ని, బీఆర్ఎస్‌లోనే (BRS) కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Jul 24, 2026, 12.37 pm IST

Malla Reddy | పార్టీ మార‌డంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి.. వీడియో
Advertisement

Malla Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి (Malla Reddy) పార్టీ మారుతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. తాను ఏ పార్టీలోకి వెళ్ల‌డం లేద‌ని, బీఆర్ఎస్‌లోనే (BRS) కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. బోయిన్‌ప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పుట్టిన‌రోజు వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. `కేటీఆర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న మంచిగా 125 ఏండ్లు బ‌త‌కాలె. స‌క్సెస్‌ఫుల్‌గా పోరాడుతున్న‌డు. త‌ప్పకుండా మ‌న‌ తెలంగాణ‌కు సీఎం కూడా కావాల‌ని కోరుకుంటున్న‌.

ర‌క్తంతో లేఖ రాసినందుకు చాలా బాధ‌నిపించింది నాకు. ఆయ‌నెవ‌రో తెలియ‌దు. అడ్ర‌స్ కూడా రాయ‌లే. త‌ప్ప‌కుండా ఆయ‌న‌ను క‌లుస్తా. ఆయ‌న బాధంతా నేను పార్టీల నుంచి పోతున్నానే క‌దా. అదే రాశిండు. నాకు కూడా బాధ‌నిపిస్తుంది. చాలా ఇబ్బందిక‌రంగా ఉంది. అడ్ర‌స్ తెస్తే త‌ప్ప‌కుండా ఇంటికి పోతుంటి. ఎట్లయినా అడ్ర‌స్ తెలుసుకుని ఆయ‌న‌ను క‌లుస్తా. నేను ఏ పార్టీలోకి పోత‌లేను. పార్టీ మారుత‌లేను` అని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement