Karimnagar | కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. నగల దుకాణంలో ఆభరణాలు దోపిడీ
Karimnagar | కరీంనగర్‌లోని (Karimnagar) పీఎంజే (PMJ) జ్యువెల్లరీ షాపులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం కస్టమర్ల ముసుగులో వచ్చిన పీఎంజే దుకాణంలోకి వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించారు.
Karimnagar | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్‌లోని (Karimnagar) పీఎంజే (PMJ) జ్యువెల్లరీ షాపులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం కస్టమర్ల ముసుగులో వచ్చిన పీఎంజే దుకాణంలోకి వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించారు. బంగారు నగలు చోరీ చేసేందుకు యత్నించారు. దీంతో సిబ్బంది, సెక్యూరిటీ ప్రతిఘటించడంతో.. దొంగలు తమ వద్ద ఉన్న తుపాకులతో వారిపై కాల్పులు జరిపారు. మిగిలిన సిబ్బందిని కట్టేశారు. షో కేసులలో ఉన్న బంగారు ఆభరణాలను పెద్దమొత్తంలో దోచుకుని పారిపోయారు.

కాల్పుల శబ్ధంతో షోరూమ్ లోపల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షోరూమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఒక మ్యాగజైన్‌ను (Bullets Magazine) అక్కడే వదిలేశారు. దీంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారు, ఏ వాహనంపై వచ్చారని తెలుసుకోవడానికి నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పట్టపగలే, రద్దీగా ఉండే ప్రాంతంలో కాల్పులు, దోపిడీ జరగడం సంచలనంగా మారింది.
సంబంధిత వార్తలు

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
ఆగస్టు 11, 2026

Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!
ఆగస్టు 8, 2026

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



