Palla Rajeshwar Reddy | జనగామ నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో రోడ్ల స్థితి అధ్వాన్నం: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు జనగామ (Jangoan) నియోజకవర్గంలో ఏ రోడ్లకు మరమ్మత్తులు చేయలేదని, నూతన రోడ్లు నిర్మించలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
Palla Rajeshwar Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు జనగామ (Jangoan) నియోజకవర్గంలో ఏ రోడ్లకు మరమ్మత్తులు చేయలేదని, నూతన రోడ్లు నిర్మించలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) ఆరోపించారు. గ్రామీణ, సీఆర్ఆర్, పంచాయితీ, ఆర్అండ్‌బీ, హ్యామ్, ఐటీడీఏ వంటి ఏ రకమైన రోడ్లలోనూ తట్టెడు మట్టి, మూర రోడ్డు కూడా వేయలేదని చెప్పారు. నియోజకవర్గంలో మొత్తం 131 గ్రామాలు, రెండు పట్టణాలు, 42 వార్డులు ఉంటాయని, ఏ ఊరికైనా అప్పటి వరకు అందుబాటులో ఉన్న బస్సులను తగ్గించారని పేర్కొన్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఏ ఊరికి పోయినా బస్సును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారని, ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే రోడ్డు బాగాలేదని, అందుకే నిలిపివేశామని చెబుతున్నారని వివరించారు. రోడ్ల మరమ్మత్తు గురించి ఆర్అండ్‌బీ మంత్రిని కలిస్తే సానుకూలంగా స్పందించినా, ఇప్పటి వరకు పనికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ - హుస్నాబాద్ రోడ్డులో బ్రిడ్జి మరమ్మత్తులకు రూ.90 లక్షలు అడిగితే మంజూరు చేశామని చెప్పారని, నలుగురు మంత్రులను కలిసినా ఫలితం రాలేదని వాపోయారు. చివరికి రెండున్నరేళ్లు ఆగితే ఇప్పుడు ఆందోళన బాట పడితే అయిదుగురు యువకులు జైలుకు పోతే నిధులు మంజూరై మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. తన నియోజకవర్గంలోని చీటకోడూరు గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైందని, రాకపోకలు స్తంభించిపోయాయని, అయినా దానికి అతీగతీ లేదని చెప్పారు.
రోడ్ల నిర్వహణ కింద రూ.13 కోట్ల నిధులతో నాలుగు రోడ్లు మంజూరు చేసి రెండేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. హామ్ కింద మూడు రోడ్లు మంజూరైనా టెండర్ ప్రాసెస్ కూడా ప్రారంభం కాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 18 రోడ్లు మంజూరయ్యాయన్న ఆయన.. ఒక్క టెండర్ కాలేదని, ఒక్క మీటరు రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. దుద్దెడ నుంచి జనగాం ప్రధాన రహదారి పూర్తి అయ్యేందుకు కూడా అందరినీ బతిమిలాడాల్సి వచ్చిందని చెప్పారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వేములవాడ, కొమరవెళ్లి మల్లన్న, ఐనవోలు, మేడారం దర్శనాలతో సాధారణంగా యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఆ దారి గుండా వేల వాహనాలు ప్రయాణిస్తున్నా వాయిదా వేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. చేర్యాల పట్టణంలో, బచ్చన్నపేట సమీపంలో రెండు కిలోమీటర్ల దూరం పూర్తి కాలేదని, స్థానికులు రోజూ ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జనగామను ఆనుకుని ఉన్న ప్రదేశంలో కూడా ఒక వాహనం పోతే ఇంకోటి పోయే అవకాశం లేదని, మొత్తం దుమ్ముతో నిండిపోతోందని పేర్కొన్నారు. సాధారణంగా రోడ్డు నిర్మాణంలో కల్వర్టులు సీసీ తో నిర్మించి, తారుతో రోడ్డు వేస్తారని, అవి కలిసే ప్రదేశంలో ప్రతీరోజూ ఎవరో ఒకరు పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణాలతో పాటు మరమ్మత్తులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని సంబంధిత మంత్రిని కోరారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






