త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే

Sirikonda Madhusudanachary | ఆరు రోజుల‌ మండ‌లి స‌మావేశాల్లో ఏ ఒక్క షార్ట్ డిస్క‌ష‌న్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి డిమాండ్ చేశారు. బిల్లుల ఆమోదానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

S

Telangana | Published On Sep 13, 2026, 12.47 pm IST

Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే
Advertisement
  • 20 అంశాల‌ను చ‌ర్చకు ప్ర‌తిపాదిస్తే ప‌ట్టించుకోలే
  • లైవ్ ప్ర‌సారాల్లో కూడా వివ‌క్ష చూపించారు
  • హామీలు మ‌రిచి బిల్లుల ఆమోదానికే ప్ర‌భుత్వం ప‌రిమిత‌మైంది
  • శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి విమ‌ర్శ‌లు

Sirikonda Madhusudanachary | త్రినేత్ర‌.న్యూస్: ఆరు రోజుల‌ మండ‌లి స‌మావేశాల్లో ఏ ఒక్క షార్ట్ డిస్క‌ష‌న్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి డిమాండ్ చేశారు. బిల్లుల ఆమోదానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రోజూ వాయిదా తీర్మానాలు ఇచ్చిన‌ప్ప‌టికీ అన్నీ తిర‌స్క‌రించార‌ని వాపోయారు. 20 అంశాలు చ‌ర్చ‌కు ప్ర‌తిపాదించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు.
లైవ్ ప్రసారాల్లో కూడా త‌మ‌పై వివక్ష కొనసాగిందన్నారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మండ‌లి జ‌రిగిన తీరుపై తీవ్ర విమ‌ర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం మండలి సమావేశాల్లో బయటపడింది. సభను నడపాలనే చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. ప్రభుత్వ అవసరాల కోసం సభ జరిపింది. హామీల అమలుపై చిత్తశుద్ధి కనిపించలేదు. మేం నిర్బంధించబడ్డామా అనే అనుమానం కలిగింది. నేను స్పీక‌ర్‌గా కూడా పనిచేశాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి పోలీసు బలగాల మోహరింపు లేదు. లోపల మార్షల్స్ మోహరించారు.

ఛైర్మన్ మా వైపు చూడలేదు. లైవ్ ప్రసారాల్లో కూడా మాపై వివక్ష కొనసాగింది. మేం మాట్లాడినపుడు కూడా సరిగా చూపలేదు. మా ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు సరిగా లేవు. బీఏసీలో జరిగిన నిర్ణయాలకు విలువ లేదు. ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలేదు. వెయ్యి రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబ‌ట్టి చర్చకు భయపడింది. ప్రభుత్వం దుర్మార్గంగా భాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డి మండలి జరిగిన తీరుకు క్షమాపణ చెప్పాలి.

మూడు నిమిషాల్లో ముగించారు..

అసెంబ్లీ బయట మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం కుట్ర. నేను పింక్ టీ షర్ట్ వేసుకున్నా. న‌న్ను సభలోనికి వెళ్ళనివ్వలేదు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే మమ్మల్ని మొదటి రోజు సభలోకి రానివ్వలేదు. మా ఇద్దరు సభ్యులను చర్చ లేకుండానే సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు పడుతుందని మూజు వాణి ఓటుతో సస్పెండ్ చేశారు. మూడు నిమిషాల్లో సస్పెన్షన్ ప్రక్రియ ముగించారు. సభ హుందాతనాన్ని వమ్ము చేశారు.

ఎన్ని రోజులైనా సభ జరుపుతామనీ, ఏ సమస్యనైనా చర్చిస్తామని చెప్పిన పాలకపక్షం పారిపోయింది. క్యూర్ బిల్లు 463 పేజీలు ఉంది. సభ్యులకు ఆ బిల్లును చదువుకునే సమయం ఇవ్వకుండానే చర్చ పెట్టారు. క్యూర్ బిల్లును సెలెక్ట్ పంపాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం వినలేదు. నిన్న క్వశ్చన్ అవర్‌ను నాలుగున్నర గంటలు జరిపారు. ఇదేనా పద్ధతి? అధికార పక్షం, మంత్రులకు అనుకూలంగా చైర్మన్ వ్యవహరించారు. మా గొంతు నొక్కారు.

ప్రభుత్వానికి ఛైర్మన్ పలు సూచనలు చేయడం అభినందనీయం. అలాంటి చైర్మన్ ప్రజాసమస్యలు చర్చించాలని ప్రభుత్వానికి చెప్పకపోవడం శోచనీయం. ఢిల్లీకి మూటలు భూ అక్రమణలే సీఎంకు ప్రాధామ్యాలుగా మారాయి. 18 గంటలు పని చేస్తున్నా అనే సీఎం ఏ ఒక్క మంచి పనైనా చేశారా అని మ‌ధుసూద‌నాచారి ప్ర‌శ్నించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement