Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
Harish Rao | రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాసనసభా వేదికగా ప్రభుత్వం ఏదైనా ఊరటనిచ్చే చెబుతందని రైతులు, పేదలు ఆశించారు.. కానీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాల ప్రవాహం పారించారు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాసనసభా వేదికగా ప్రభుత్వం ఏదైనా ఊరటనిచ్చే చెబుతందని రైతులు, పేదలు ఆశించారు.. కానీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాల ప్రవాహం పారించారు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన అంశం 22ఏ నిషేధిత భూముల విషయం. అసెంబ్లీ సాక్షిగా దాని నుంచి రిలీఫ్ వస్తుందని ఆశించిన బాధితులకు ఎలాంటి రిలీఫ్ రాలేదు. ఉద్దేశపూర్వకంగానే శాసనసభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసి, పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు. మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగారు, క్షమాపణ చెప్పాలి, మైకు ఇవ్వండి మాడ్లాడడానికి అంటే మమ్మల్ని సస్పెండ్ చేసారు.
బిఆర్ఎస్ అసెంబ్లీలో ఉంటే మీ అవినీతి బట్టబయలు అవుతుందని ఉద్దేశ్యపూర్వకంగా బయటకు పంపారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
22ఏ నిషేధిత భూములపై మేము అనేక అంశాలు లేవనెత్తాం, పీపీటీ ద్వారా చెప్పినం. పొంగులేటి.. నేను అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రాష్ట్రంలో ఒక సమస్య వస్తే పార్టీలకు అతీతంగా విపక్షాలు స్పందిస్తాయి. ఆ సోయి కూడా లేకుండా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నట్లు చిల్లరగా మాట్లాడాడు. నిన్న ఎంఐఎం ఫీజురీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడింది అంటే బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అంటవా అని పొంగులేటిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
మేము సూటిగా అడిగినం.. ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టావు అని. దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. పొంగులేటి మొత్తానికి ఒప్పుకున్నరు. తప్పు జరిగిందని. డిసెంబర్ 3, 2025 నాడు మేము ఒక లిస్ట్ అప్ లోడ్ చేసినం, సమస్య అక్కడే వచ్చింది అంటున్నడు. టైం తక్కువ ఉన్న కారణంగా చూసుకోకుండా అందరి భూములను అప్ లోడ్ చేసినం అని చెప్పినవు. తప్పు ఒప్పుకున్నవు, కానీ, ప్రజలను బాధ పెట్టినందుకు, క్షమాపణ చెబుతావని ఆశించామని హరీశ్ రావు తెలిపారు.
సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెబుతారని ఆశించాం.. అదీ లేదు. ముఖ్యమంత్రి ఇల్లు జాబితా నుంచి ఎలా తీసినవో, ప్రజల భూములు కూడా తీస్తవని అనుకుంటే లేదు. ఎన్ని భూములు పెట్టినవు, ఎన్ని భూములు తీసినవు అని శ్వేతపత్రం విడుదల చేస్తావు అని చూస్తే అదీ లేదు. పొంగులేటి అనేక అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 12, 2026

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!



