Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..
Vinayaka Chavithi | హిందువుల అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి (Vinayaka Chavithi) ఒకటి. విజ్ఞాలను తొలగించే ఆ గణపతిని ప్రార్ధించకుండా ఏ పనిని ప్రారంభించరు. అందుకే వినాయకుడి పూజకు ప్రథమ స్థానం. బుద్ధికి, శక్తికి, విఘ్నాలు తొలగడానికి వినాయకుని ఆరాధించడం సర్వ సాధారణం.
Devotional | Published On Sep 13, 2026, 12.27 pm IST
Vinayaka Chavithi | త్రినేత్ర.న్యూస్: హిందువుల అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి (Vinayaka Chavithi) ఒకటి. విజ్ఞాలను తొలగించే ఆ గణపతిని ప్రార్ధించకుండా ఏ పనిని ప్రారంభించరు. అందుకే వినాయకుడి పూజకు ప్రథమ స్థానం. బుద్ధికి, శక్తికి, విఘ్నాలు తొలగడానికి వినాయకుని ఆరాధించడం సర్వ సాధారణం. గజరాజు ముఖం, తొండంతో దర్శనమిచ్చే బొజ్జగణపయ్యకు విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, లంబోదరుడు వంటి అనేక పేర్లు ఉన్నాయి. అలాగే సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, సింధూర గణపతి, ఉచ్చిష్ట గణపతి, కార్యసిద్ధి గణపతి, సంపదలు ప్రసాదించే సంపత్ గణపతి అని ఇలా రకరకాల రూపాల్లో (Ganesh 32 Forms) గణపతిని పూజిస్తారు. అయితే పార్వతీ తనయుడికి ముద్గల పురాణాన్ని అనుసరించి 32 రూపాలు ఉన్నాయి. వాటిలో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని `షోడశ`' గణపతులు అంటారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంది.

గణనాథుని స్వరూపాలు..
బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడను పట్టుకుని దర్శనమిస్తారు. చిన్నారి రూపంలో ఉండే ఈ గణపతిని సంతోషం, స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తారు. బుద్ధి చురుగ్గా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
తరుణ గణపతి
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పాశం, వెలగ గుజ్జు, దంతం, చెరకు.. ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్ర తో దర్శనమిస్తారు. ఈ రూపాన్ని ఉత్సాహం, ధైర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ గణపతిని పూజిస్తే సమయానికి బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది.
భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు.. ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. భక్తి, పవిత్రత, ప్రేమకు సంకేతం. ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.
వీర గణపతి
ఈ వినాయకుడు శౌర్యం, సంకల్పబలానికి సూచిక. ఈ రూపానికి పదహారు చేతులుంటాయి. కుడి వైపు ఉన్న ఎనిమిది చేతులతో బాణం, భేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా.. ఎడమవైపు ఉన్న ఎనిమిది చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.
శక్తి గణపతి
రక్షణ, సౌభాగ్యం, దైవిక శక్తులకు ప్రతీకగా భావిస్తారు. ఈ గణపతి చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. నాలుగు చేతులలో అంకుశం, పాశం, విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే కష్టాలను ఎదిరించి నిలబడగల ధైర్యం, ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
ఉచ్చిష్ట గణపతి
భక్తి, పవిత్రత, ప్రేమక సంకేతం. ఈ గణేశుడుకి నాలుగు చేతులుంటాయి. కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను.. ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మ పండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దైవం గా ఉచ్చిష్ట గణపతి ప్రసిద్ధి చెందాడు.
ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమ వైపు ఉన్న చేతులతో అక్షర మాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే విద్య బాగా వస్తుంది.
సిద్ధి గణపతి లేదా పింగళ గణపతి
విజయాన్ని చేకూర్చే సంకేతానికి ప్రతీక. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పండిన మామిడి పండు, ఎడమ వైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు.

విఘ్న గణపతి
అడ్డంకులను తొలగించే శక్తికి సూచిక. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి.. ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. గణపతి సహజ లక్షణమైన విఘ్న నాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా ముఖ్యమైన కార్యం ప్రారంభించే ముందు ఈ గణపతిని సేవిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది.
క్షిప్ర ప్రసాద గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఉంటాయి. ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షం తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతి స్వరూపాన్ని ఆరాధిస్తే భక్తులకు కష్టాల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ఈ రూపం త్వరిత అనుగ్రహానికి ప్రతీక.
హేరంబ గణపతి
నిర్భయం, రక్షణకు ప్రతీక. ఈ రూపానికి పది చేతులుంటాయి. కుడి వైపు చేతితో అభయ ముద్రనిస్తూ, కత్తి, జప మాల, గొడ్డలి, మోదకం ధరించి ఉండగా, ఎడమ వైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తాడు.
లక్ష్మీ గణపతి
సంపద, మేధస్సు, ఐశ్వర్యానికి ప్రతీక. ఈయన రూపానికి పది చేతులుంటాయి. కుడి వైపు చేతితో వరద ముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి ఉంటాడు. ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తాడు. ఈ గణపతి స్వరూపాన్ని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
మహా గణపతి
అపారమైన దైవిక శక్తికి సంకేతం. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరి కంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలు చేకూరుతాయని విశ్వాసం.
విజయ గణపతి
చేసే ప్రయత్నాల్లో విజయానికి ప్రతీక. ఈ గణపతి స్వరూపానికి నాలుగు చేతులు ఉంటాయి. కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త విజయాలు చేకూరుతాయి.

నాట్య గణపతి
ఆనందం, కళ, విభిన్న ప్రతిభకు ప్రతీక. ఈ గణపతి స్వరూపం చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. కుడివైపు ఉన్న రెండు చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు. ఈ స్వరూపాన్ని పూజిస్తే సంతృప్తిని, మనశ్శాంతి కలుగుతుంది.
ఊర్ధ్వ గణపతి
ఈ రూపం ఎదుగుదల, ఆద్యాత్మికతకు సంకేతం. అష్టభుజాలతో గణేశుడు దర్శనమిస్తారు. కుడివైపు ఉన్న నాలుగు చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం ఉండగా, ఎడమ వైపు ఉన్న నాలుగు చేతులలో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరిస్తారు. ఈ గణపతి స్వరూపాన్ని పూజిస్తే చేయని తప్పుకు నిందలు, కారాగార బాధలు తొలగుతాయని అంటారు.

ఏకాక్షర గణపతి: చేసే ప్రయత్నాల్లో విజయానికి ప్రతీక
వర గణపతి: కరుణ, దాత్రుత్వం, అనుగ్రహానికి సూచిక
త్రయాక్షర గణపతి: పవిత్ర నాదం, విశ్వచైతన్యంతో అనుసంధానానికి ప్రతీక
క్షిప్ర ప్రసాద గణపతి: త్వరిత అనుగ్రహానికి ప్రతీక
హరిద్రా గణపతి: మంగళం, శ్రేయస్సుకు ప్రతీక
ఏకదంత గణపతి: మేధస్సు, త్యాగం, అహంకరాన్ని అధిగమించడానికి సంకేతం
సృష్టి గణపతి: విభిన్న ప్రతిభ, సంకల్పాల సాకారానికి ప్రతీక
ఉద్ధండ గణపతి: ధర్మ పరిరక్షణ, క్రమశిక్షణకు ప్రతీక
ఋణ మోచన గణపతి: భౌతిక రుణాలతో పాటు అంతర్గత భారాల నుంచి విముక్తికి సంకేతం
దుండి గణపతి: భక్తి, జ్ణానాన్వేషణకు సూచిక
ద్విముఖ గణపతి: విభిన్న కోణాల్లో ఆలోచించే వివేకాన్ని తెలియజేసే గణపతి
త్రిముఖ గణపతి: మేధస్సు, చైతన్యం, రక్షణకు ప్రతీక
సింహ గణపతి: ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక
యోగ గణపతి: ధ్యానం, ఏకాగ్రత, మనోనిగ్రహానికి ప్రతిరూపం
దుర్గా గణపతి: ప్రతికూలతపై విజయానికి సంకేతం
సంకష్ట గణపతి: కష్టాల నుంచి ఉపశమనం, ప్రశాంతత, శ్రేయస్సుకు ప్రతీక
ఈ 32 వినాయకుని రూపాలు కేవలం వేర్వేరు విగ్రహాలు కాకుండా, మనిషి జీవితంలో అవసరమయ్యే వేర్వేరు గుణాలకు సంకేతాలుగా ఉంటాయని పండితులు చెబుతారు. విఘ్నేశ్వరుని చేతిలో ఉండే ఆయుధాలు ప్రతికూలతను ఎదుర్కొనే శక్తిని, పండ్ల రత్నాలు ఎదుగుదలను, జపమాల ఆధ్యాత్మికతను సూచిస్తాయి. బొజ్జ గణపయ్య రూపం, రంగు, ముఖం, చేతులు, వాహనం ఉండే విగ్రహ లక్షణాలు కూడా ప్రత్యేక అర్థాలను తెలియజేస్తాయని పండితులు చెబుతున్నారు.
బెంగళూరు నగరం జలహళ్లిలోని BEL కాలనీలోని శ్రీ మహాగణపతి ఆలయంలో ఉన్నాయి. దీంతో పాటు కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కుందపుర తాలుకా హట్టియంగాడి సిద్ధి వినాయక ఆలయంలోనూ ఈ 32 గణపతి రూపాలు ప్రతిష్టించబడ్డాయని పండితులు చెబుతారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
సెప్టెంబర్ 13, 2026

CM Revanth Reddy | అతిథుల వివరాలను అందించండి.. గణేశ్ మండప నిర్వాహకులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 12, 2026

Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు ధ్వజం
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ
- ●Vijay - Trisha | త్రిష సడెన్ ఎంట్రీ - ముఖం చాటేసిన విజయ్ - ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ

Vijay - Trisha | త్రిష సడెన్ ఎంట్రీ - ముఖం చాటేసిన విజయ్ - ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు




