త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | యువ‌త డ్ర‌గ్స్‌.. ఫామ్‌హౌస్‌లు, పబ్బుల‌కు దూరంగా ఉండాలి: సీఎం రేవంత్‌

Revanth Reddy | యువ‌త డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. ప్రభుత్వం క్రీడలను పోత్సహిస్తున్న‌ద‌ని, విద్యార్థులు చదువుతోపాటు ఆట‌ల్లోనూ ఆసక్తి పెంచుకోవాల‌ని సూచించారు.

G

Telangana | Published On Mar 28, 2026, 7.34 pm IST

Revanth Reddy | యువ‌త డ్ర‌గ్స్‌.. ఫామ్‌హౌస్‌లు, పబ్బుల‌కు దూరంగా ఉండాలి: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: య యువ‌త డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. ప్రభుత్వం క్రీడలను పోత్సహిస్తున్న‌ద‌ని, విద్యార్థులు చదువుతోపాటు ఆట‌ల్లోనూ ఆసక్తి పెంచుకోవాల‌ని సూచించారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. తమ మంత్రివ‌ర్గంలోనూ మంచి క్రీడాకారులు ఉన్నారన్నార‌ని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఓ ఉపశమనమ‌ని తెలిపారు. తెలంగాణ ఒకప్పుడు క్రీడల రాజధానిగా ఉండేద‌ని, కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత క్రీడా స్ఫూర్తి కనుమరుగైందని చెప్పారు.

త‌మ ప్రభుత్వం స్పోర్ట్స్‌ పాలసీని రూపొందించిందని వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీయాల‌న్నారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో సీఎం కప్‌ స్పోర్ట్స్‌ నిర్వహించామ‌ని తెలిపారు. లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శించాయి. అత‌డు ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్‌ దిగ్గజం. మెస్సీలాంటి ఆటగాడిని కాకుండా ప్రపంచ డ్రగ్‌ డీలర్‌ను పిలవాలా? అని ప్ర‌శ్నించారు. రాజకీయపరంగా విమర్శలు చేస్తే పట్టించుకోన‌ని వెల్ల‌డించారు. బీఆర్ఎస్ నేతలు క్రీడలను ఎందుకు బహిష్కరించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. ఫామ్‌హౌస్‌లు, పబ్బులు వంటివాటికి యువత దూరంగా ఉండాల‌న్నారు. యువ‌త మ‌త్తు వ‌ద‌లండి మైదానం బాట ప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆలోచనలు ఫామ్‌హౌస్‌లు, పబ్బుల్లో పార్టీలు, విందులేన‌ని విమర్శించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు బేగంపేట హాకీ స్టేడియాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంద‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement