త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్ర‌గానివా? క‌రువును వొదిలేసి క్షుద్ర‌పూజ‌ల లొల్లేంది?

Kranthi Kiran | రేవంత్ రెడ్డి సీఎమో.. మంత్రగాడో తెలియ‌డం లేద‌ని.. రాష్ట్రంలో క‌రువును వ‌దిలేసి క్షుద్ర‌పూజ‌ల లొల్లిని ముంగ‌టేసుకొని కాలం వెల్ల‌దీస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర‌ణ్ ఫైర‌య్యారు. ప్ర‌జ‌ల‌కు రేవంత్ రంగుల‌న్నీ తెలిసిపోయాయ‌న్నారు.

S

Telangana | Published On Aug 16, 2026, 3.46 pm IST

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్ర‌గానివా? క‌రువును వొదిలేసి క్షుద్ర‌పూజ‌ల లొల్లేంది?
Advertisement
  • ప్ర‌జ‌ల‌కు నీ రంగుల‌న్నీ తెల‌సిపోయిన‌య్‌
  • అందుకే హ‌రీశ్‌రావుపై పిచ్చి విమ‌ర్శ‌లు చేస్తున్న‌వ్‌
  • నిన్న సంగ‌మేశ్వ‌ర, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌ గురించి ఎందుకు మాట్లాడ‌లే
  • సీఎం రేవంత్‌ను ఉతికిఆరేసిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

Kranthi Kiran | త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి సీఎమో.. మంత్రగాడో తెలియ‌డం లేద‌ని.. రాష్ట్రంలో క‌రువును వ‌దిలేసి క్షుద్ర‌పూజ‌ల లొల్లిని ముంగ‌టేసుకొని కాలం వెల్ల‌దీస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర‌ణ్ ఫైర‌య్యారు. ప్ర‌జ‌ల‌కు రేవంత్ రంగుల‌న్నీ తెలిసిపోయాయ‌న్నారు. కేసీఆర్‌ను పశుపతి లాగా ఫామ్‌హౌజ్‌లో బంధించానని అన్నాడ‌ని.. ఏ క్షుద్ర విద్యను నేర్చుకుని రేవంత్ బంధించారో చెప్పాల‌న్నారు. నిన్న సంగ‌మేశ్వ‌ర, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడ‌లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో క్రాంతికిర‌ణ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ను చెడుగుడు ఆడుకున్నారు.

హరీష్ రావు తిరిగిన గుడులే పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తిరిగారు. రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు చేసి సీఎం అయ్యారని మేం అన్నామా? రేవంత్ రెడ్డి అప్పుడు అందరికీ చెప్పే గుడులు తిరిగారా? రేవంత్ రెడ్డి అసోం కామాఖ్య గుడికి ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు. ఇక నుంచి గుడులకు పోయేది రేవంత్ రెడ్డికి చెబితే ప్రొటోకాల్, బందోబస్తు ఇస్తారా?

ఇంకెన్నాళ్లు ఈ డైవర్షన్ రాజకీయాలు? ప్రజలకు రేవంత్ రెడ్డి రంగులన్నీ తెలిసిపోయాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిసి రేవంత్ రెడ్డి పిచ్చి విమర్శలు చేసి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా క్షుద్ర పూజలు అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే హరీష్ రావును పిచ్చి ఆరోపణలతో దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ ఎన్నటికీ సఫలం కాలేరు అని క్రాంతి కిర‌ణ్ హిత‌వు ప‌లికారు.

ఇది ఏఐ యుగమని మరుస్తున్నరు: ఎమ్మెల్యే మాణిక్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రాతియుగం వైపు తీసుకెళ్లేందుకే క్షుద్ర పూజలంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకునే కాలం ఇది. రేవంత్ చెప్పిందంతా జోకర్ మాటల్లా ఉంది. హరీష్ రావు ప్రజా సమస్యల గురించి అడుగుతుంటే రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. బట్ట గాల్చి మీదేస్తే అబద్దం నిజం కాదు. జహీరాబాద్‌కు గతంలో ఎన్నో హామీలిచ్చి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలను ఎవ్వరూ విశ్వసించడం లేదు. జగ్గారెడ్డిని అందరి ముందు సిగ్గు లేనోడా అనొచ్చా? కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాహుల్ గాంధీ ఇస్తారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడుగా ఎందుకు ఉన్నట్టు? ఖర్గే దళితుడనే రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారా? రేవంత్ రెడ్డి సీఎంనని మరచి ఇంకా పీసీసీ అధ్యక్షుడిలాగే మాట్లాడుతున్నారు. సీఎం తన అన్నదమ్ములనే చూసుకుంటున్నారు. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. అందరినీ వంచించిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తథ్యం.

జగ్గారెడ్డి ఇంద్రుడు, చంద్రుడు అయితే ప్ర‌జ‌లు ఎందుకు ఓడిస్తారు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

జగ్గారెడ్డి ఇంద్రుడు, చంద్రుడు అయితే సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడిస్తారు? సంగారెడ్డి మీటింగ్ కాంగ్రెస్ సభలా జరిగింది. ఎమ్మెల్యేగా నాకు కనీస సమాచారం లేదు. సంగారెడ్డిలో ఓడిపోయిన జ‌గ్గారెడ్డిని పక్కన పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి తీరు ఉంది. నన్ను మాత్రమే కాదు సంగారెడ్డి ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చీడ, పీడ లాంటివారు. సంగారెడ్డి గడ్డపై అడుగు పెట్టే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో బజారు భాష మాట్లాడారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం క్షుద్ర పూజల డ్రామాకు తెరలేపారు. సీఎం పదవిలో ఉండి మూఢ నమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ కార్డులపై సీఎం, మంత్రి ఫోటోలు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.

Advertisement
Advertisement