త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అడుగ‌డుగునా అడ్డ‌గింత‌.. ప‌రిగి వెళ్ల‌కుండా హ‌రీశ్‌రావుకు ఆంక్ష‌లు

Harish Rao | ప‌రిగిలో (Parigi) ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ (Industrial Corridor) బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావును (Harish Rao) పోలీసులు అడ్డుకున్నారు. అప్ప జంక్షన్ వ‌ద్ద మ‌రోసారి పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

S

Telangana | Published On Apr 7, 2026, 12.02 pm IST

Harish Rao | అడుగ‌డుగునా అడ్డ‌గింత‌.. ప‌రిగి వెళ్ల‌కుండా హ‌రీశ్‌రావుకు ఆంక్ష‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప‌రిగిలో (Parigi) ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ (Industrial Corridor) బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావును (Harish Rao) పోలీసులు అడ్డుకున్నారు. అక్ర‌మంగా గృహ నిర్బంధం చేశారు. హ‌రీశ్‌రావు నివాసం వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఏదేమైనా రైతుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు హరీశ్ రావు నిర్బంధాల‌ను చేదించుకుని నాయ‌కుల‌తో క‌లిసి ప‌రిగికి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో మార్గమధ్యంలో అప్ప జంక్షన్ వ‌ద్ద మ‌రోసారి పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌రిగి చేరుకోకుండా అడుగడుగునా ఆంక్ష‌లు విధిస్తున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, నాయ‌కులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెల‌కొన‌డంతో అప్ప జంక్ష‌న్ వ‌ద్ద వాడీ వేడీ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. హరీశ్ రావు వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయ‌కులు, కార్యక‌ర్త‌లు ఉన్నారు.

హ‌రీశ్‌రావు అరెస్టు..

మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసుల గోప్యత పాటిస్తున్నారు. పోలీస్ వాహ‌నాల్లో ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు త‌ర‌లిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు.

అరెస్టులు అక్ర‌మం: హ‌రీశ్‌రావు

అరెస్టు సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. రాక్ష‌స పాల‌న‌, దుర్మార్గ‌పు పాల‌న‌,
పోలీసు పాల‌న, గ‌డీల పాల‌నగా మారిపోయిందని ఆగ్ర‌హించారు. ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింది. క‌ష్టాల్లో ఉన్న రైతుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి వెళ్లొద్దా? మాన‌వ హ‌క్కుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల‌రాస్తుంది. నిరాహార దీక్ష చేస్తున్న రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా. న‌డిరోడ్డు పై అరెస్టులు అక్ర‌మం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. మ‌మ్మ‌ల్నీ ఎవ‌రు తిట్టినా అరెస్టు చేస్త‌లేం అని నిన్ననే ఆదిలాబాద్ స‌భ‌లోనే అన్న‌వ్ క‌దా.. మ‌రి ఈరోజు మ‌మ్మ‌ల్ని న‌డిరోడ్డు మీద ఎందుకు అరెస్టు చేస్తున్న‌వ్ రేవంత్ అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. నీ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేదా అని ప్ర‌శ్నించారు.

ప‌రిగి మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప‌లువురు బీఆర్ఎస్‌ నేతలను గృహ నిర్బంధం చేయ‌డంపై కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement