త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chevella | చేవెళ్లలో కంపించిన భూమి.. ఇండ్ల నుంచి ప‌రుగులు తీసిన జ‌నం

Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) ప‌ట్ట‌ణంతోపాటు పరిసర ప్రాంతాల్లో స్వ‌ల్ప భూకంపం వ‌చ్చింది. శుక్ర‌వారం ఉద‌యం ఒక్కసారిగా భూమి కంపించింది (Earthquake).

G

Telangana | Published On Mar 20, 2026, 12.00 pm IST

Chevella | చేవెళ్లలో కంపించిన భూమి.. ఇండ్ల నుంచి ప‌రుగులు తీసిన జ‌నం
Advertisement

Chevella | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) ప‌ట్ట‌ణంతోపాటు పరిసర ప్రాంతాల్లో స్వ‌ల్ప భూకంపం వ‌చ్చింది. శుక్ర‌వారం ఉద‌యం ఒక్కసారిగా భూమి కంపించింది (Earthquake). భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనలు రావ‌డంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్రజలు ఇండ్ల‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉద‌యం 9.30 గంట‌ల స‌మ‌యంలో గట్టిగా శబ్ధం వినిపించిందని, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించింద‌ని స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేదా సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement