V Hanumantha Rao | జ్ఞానేశ్కుమార్లాంటోళ్లను పెట్టుకుంటే ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండేది
V Hanumantha Rao | కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్‌కుమార్ లాంటి వాళ్ళను పెట్టుకుంటే ఇప్పటివరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.
- నాలుగోసారి మోదీ ప్రధాని కావడం ఎట్టిపరిస్థితుల్లో జరగదు
- ఓబీసీలకు సిగ్గు, శరం ఉంటే బీజేపీకి ఓట్లు వేయొద్దు
- జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టకుంటే బీజేపీకి నామరూపాలుండవ్
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఫైర్
V Hanumantha Rao | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్‌కుమార్ లాంటి వాళ్ళను పెట్టుకుంటే ఇప్పటివరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. నాలుగోసారి మోదీ ప్రధానమంత్రి కావాలని బీజేపీ కుట్ర చేస్తోందని.. అది ఎట్టిపరిస్థితుల్లో జరగదన్నారు. ఓబీసీలకు సిగ్గు, శరం ఉంటే బీజేపీకి ఓట్లు వేయొద్దని సూచించారు. అప్పుడే వారికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. జనగణనలో ఓబీసీ కాలమ్ ఎందుకు పెట్టడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, అమిత్ షా, బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు.
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌కు అన్ని ఓటములే అని అమిత్ షా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను పక్కకు జరిపి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రధాన కమిషనర్ కుట్ర చేస్తున్నారు. ఎస్.ఐ.ఆర్ పై దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఓబీసీలను ఓట్లు వేసే మిషన్ లా చూస్తున్నారు. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ ను అడ్డం పెట్టుకుని మోదీ రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ జనగణనలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు
ఓబీసీలకు ఆలోచించే శక్తి ఉంది. ఓబీసీలు అంతా బీజేపీని ఓడగొట్టాలి. జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టకపోతే బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తాం. బీసీలు నరేంద్ర మోదీ అంతు చూడాలి. ఓబీసీలు సిగ్గు, శరం ఉంటే నరేంద్ర మోదీకి, బీజేపీకి ఓట్లు వేయవద్దు. బీజేపీకి ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాం. ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడుతున్నారు. అమిత్ షా తన వైఖరి మార్చుకోవాలి. ఓబీసీలు దేశ జనాభాలో 60 శాతం ఉన్నాం. ఆర్.ఎస్.ఎస్, బీజేపీని ఓడగొడితేనే ఓబీసీలకు భవిష్యత్ ఉంటుంది.
బీజేపీ ఓబీసీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఓబీసీలను చైతన్యవంతం చేయడం కోసం అన్ని జిల్లాలు, రాష్ట్రాలు తిరుగుతాం. బీజేపీ కేంద్రంలో ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ ఆఫీస్‌కు వెళ్తే రాహుల్ గాంధీకి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్ కుమార్ లాంటి వాళ్ళను పెట్టుకుంటే ఇప్పటివరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు
అక్టోబర్ 15, 2026

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్
అక్టోబర్ 15, 2026

Harish Rao | ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగొడుతారు చూస్కో రేవంత్: హరీశ్ రావు
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Supreme Court Women Journalists Plea | రీల్స్ చేసేవారెవరో, జర్నలిస్ట్ ఎవరో ఎలా తెలుస్తుంది?
- ●Ponnam Prabhakar | క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం
- ●CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్.. ఫోన్లో పేరు తప్పనిసరి..
- ●Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్
- ●Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి
- ●IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?

Supreme Court Women Journalists Plea | రీల్స్ చేసేవారెవరో, జర్నలిస్ట్ ఎవరో ఎలా తెలుస్తుంది?

Ponnam Prabhakar | క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్.. ఫోన్లో పేరు తప్పనిసరి..

Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్



