త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. స‌మీపంలోని బిల్డింగ్‌ల‌కు అంటుకున్న మంట‌లు

Fire Accident | హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని నందనవనంలో (Nandanavanam) భారీ అగ్నిప్రమాదం (Fire Accidents) జ‌రిగింది. మెట్రో బార్ సమీపంలో ఉన్న‌ ఓ ప్లాస్టిక్ గోదాంలో (Plastic Godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

G

Hyderabad | Published On Jul 15, 2026, 8.20 am IST

Fire Accident | ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. స‌మీపంలోని బిల్డింగ్‌ల‌కు అంటుకున్న మంట‌లు
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని నందనవనంలో (Nandanavanam) భారీ అగ్నిప్రమాదం (Fire Accidents) జ‌రిగింది. మెట్రో బార్ సమీపంలో ఉన్న‌ ఓ ప్లాస్టిక్ గోదాంలో (Plastic Godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సామాగ్రి అధికంగా ఉండ‌టంతో మంట‌లు వేగంగా వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న మరో గోదాంతో పాటు సమీప భవనాల‌కు మంట‌లు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకునిఅదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్న‌ది. అయితే ఎలాంటి ప్రాణ‌న‌ష్ట జ‌రుగ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా, షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌లు చెల‌రేగి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement