Muslim Couple Wins Ganapathi Laddu | వినాయక వేడుకల్లో వెల్లివిరిసన మతసామరస్యం.. లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు
Muslim Couple Wins Ganapathi Laddu | త్రినేత్ర న్యూస్: వినాయక చవితి వేడుకల్లో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. తొర్రూరులో ముస్లిం దంపతులు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు.
Muslim Couple Wins Ganapathi Laddu | త్రినేత్ర న్యూస్: వినాయక చవితి వేడుకల్లో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. నిన్న జగిత్యాలలో జరిగిన వేలం పాటలో ముస్లిం సోదరులు గణపతి లడ్డూను దక్కించుకోగా తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులైన ముస్లిం దంపతులు వేలంలో రూ.85,316 లకు లడ్డూను కొనుగోలు చేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. తొర్రూరులోని టీచర్స్ కాలనీలో ఉపాధ్యాయులైన షేక్ దర్గా హుస్సేన్, రజియా బేగం వినాయక లడ్డూను దక్కించుకుని స్ఫూర్తిగా నిలిచారు.
నా కుటుంబానికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి..
ఈ సందర్భంగా షేక్ దర్గా హుస్సేన్ మాట్లాడారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయున్ని. లడ్డూ కొంటే మంచి జరుగుతుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. 26 ఏళ్ల క్రితం కూడా ఫ్రెండ్స్‌తో కలిసి లడ్డూను వేలంలో కొన్నాను. దీంతో బీఈడీ, పీజీలో సీట్లు ఒకేసారి వచ్చాయి. గత నాలుగేళ్లుగా నా భార్య అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఆమెకు మంచి జరగాలని లడ్డూ వేలంలో పాల్గొన్నా. దేవుని దయ వల్ల ఆ ప్రసాదం నాకు రావడం సంతోషంగా ఉంది. విఘ్నేశ్వరుడి దయవల్ల వచ్చే ఏడాది నాటికి నా భార్య ఆరోగ్యం బాగవ్వాలి. దేవుడి ఆశీస్సులు నా కుటుంబం మీద ఉండాలి.
అదే మనల్ని కాపాడుతుంది..
మతసామరస్యాన్ని చాటాల్సిన బాధ్యత ఉందని ఒక ఉపాధ్యాయుడిగా నేను గ్రహించాను. అదే మనల్ని కాపాడుతుంది. అందరం భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి. ఈ ప్రసాదం ద్వారా నా ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని షేక్ దర్గా హుస్సేన్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లివిరిసిన మతసామరస్యం
టీచర్స్ కాలనీలో వేలంపాటలో రూ.85,316 లకు గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బేగం త్వరగా కోలుకోవాలని లడ్డూను సొంతం చేసుకున్న భర్త హుస్సేన్#Thorrur #ladduAuction #TV9Telugu pic.twitter.com/iHtO0lbFSU
— TV9 Telugu (@TV9Telugu) September 25, 2026
సంబంధిత వార్తలు

V Srinivas Goud | తెలంగాణ ఐటీ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోం
సెప్టెంబర్ 25, 2026

CJP | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అక్టోబర్ 2నుంచి దేశవ్యాప్త నిరసనలు : సీజేపీ
సెప్టెంబర్ 25, 2026

Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ – రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ – నైజాంలో హయ్యెస్ట్
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ - నైజాంలో హయ్యెస్ట్
- ●Manmohan Singh | గచ్చిబౌలి విప్రో సర్కిల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం
- ●Air India | ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్
- ●Khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు
- ●Supreme Court | ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
- ●Alia Bhatt | బోల్డ్ లుక్‌లో అలియా భట్ - భర్త సినిమాలో క్యాబరే డ్యాన్సర్‌గా బాలీవుడ్ బ్యూటీ

Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ - నైజాంలో హయ్యెస్ట్

Manmohan Singh | గచ్చిబౌలి విప్రో సర్కిల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం

Air India | ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్

Khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు



