త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khairatabad Ganesh | గంగ‌మ్మ ఒడికి ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు

Khairatabad Ganesh | ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద‌కు చేరుకున్న 69 అడుగుల పంచ‌ముఖ సంక‌ట‌హ‌ర మ‌హాగ‌ణ‌ప‌తికి ఉత్స‌వ క‌మిటీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. వేలాది మంది భ‌క్తులు వీడ్కోలు ప‌లుకుతుండ‌గా.. బ‌డా గ‌ణేశ్ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడు.

S

Hyderabad | Published On Sep 25, 2026, 2.43 pm IST

Khairatabad Ganesh | గంగ‌మ్మ ఒడికి ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు
Advertisement

6 గంట‌ల‌కు పైగా కొన‌సాగిన శోభాయాత్ర‌
బ‌డా గ‌ణేశ్‌కు వేలాది మంది భ‌క్తులు వీడ్కోలు
క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద నిమ‌జ్జ‌నం

Khairatabad Ganesh | త్రినేత్ర న్యూస్ : ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద‌కు చేరుకున్న 69 అడుగుల పంచ‌ముఖ సంక‌ట‌హ‌ర మ‌హాగ‌ణ‌ప‌తికి ఉత్స‌వ క‌మిటీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. వేలాది మంది భ‌క్తులు వీడ్కోలు ప‌లుకుతుండ‌గా.. బ‌డా గ‌ణేశ్ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ మార్గ్ అంతా బై బై గ‌ణేశా, గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా నినాదాల‌తో మార్మోగిపోయింది. క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం ప్ర‌శాంతంగా ముగిసింది. బ‌డా గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్‌ మహాగణపతి ఎదుట డ్యాన్స్‌ చేశారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఖైరతాబాద్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద‌కు చేరుకుంది.

Advertisement
Advertisement