త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manmohan Singh | గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్‌లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ విగ్ర‌హం

Manmohan Singh | హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని విప్రో స‌ర్కిల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కాంస్య విగ్ర‌హాన్ని శ‌నివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించ‌నున్నారు.

S

Telangana | Published On Sep 25, 2026, 3.01 pm IST

Manmohan Singh | గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్‌లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ విగ్ర‌హం
Advertisement

Manmohan Singh | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని విప్రో స‌ర్కిల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కాంస్య విగ్ర‌హాన్ని శ‌నివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించ‌నున్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను హైద‌రాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. 1991లో ఆర్థిక మంత్రిగా మ‌న్మోహ‌న్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు దోహదపడ్డాయి. ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. మ‌న్మోహన్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో తాను ఎంపీగా పని చేసే అవ‌కాశం ల‌భించింది. క‌రీంన‌గ‌ర్ అభివృద్ధికి కూడా ఆయ‌న ఎంతో స‌హ‌కారం అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఆయ‌న పాత్ర చారిత్రాత్మ‌కం. ఈ క్ర‌మంలో విప్రో స‌ర్కిల్‌లో మ‌న్మోహ‌న్ సింగ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి త‌గిన గౌర‌వం క‌ల్పిస్తున్నామ‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement