Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు
Manchirevula | మంచిరేవుల ఫారెస్టు ట్రెక్ పార్కు సమీపంలోని ‘ఘర్ ఏ ముబారక్’ దర్గా గుట్ట పక్కన వున్న గుట్టలో ఎరుపు రంగులో రాసిన రాతలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం, సేవ్ రాక్స్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ బృందానికి చెందిన సభ్యులు గుర్తించారు.
Manchirevula | త్రినేత్ర న్యూస్ : మంచిరేవుల ఫారెస్టు ట్రెక్ పార్కు సమీపంలోని ‘ఘర్ ఏ ముబారక్’ దర్గా గుట్ట పక్కన వున్న గుట్టలో ఎరుపు రంగులో రాసిన రాతలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం, సేవ్ రాక్స్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ బృందానికి చెందిన సభ్యులు గుర్తించారు. అక్కడున్న ఓ ప్రాచీన ఆవాసం వద్ద పరిగెరాయి కింద రాతిగుండు గోడ మీద ఈ రాతలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ గుర్తించారు. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ గతంలో ఫారెస్టు ట్రెక్ పార్కులో రాక్ ఆర్ట్, పాతరాతియుగం పనిముట్లను కనుగొన్న సంగతి తెలిసిందే.

శనివారం కొత్త తెలంగాణ చరిత్రబృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యుడు కావలి చంద్రకాంత్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్, మిత్రులు సిద్ధార్థ, సేవ్ రాక్స్ నుంచి డా. సుధీర్ భాను ఈ ప్రదేశాన్ని పరిశీలించి, ఆ రాతలను చదివే ప్రయత్నం చేసారు. హరగోపాల్ ఈ రాతలలో చెదిరిపోగా మిగిలిన లిపిని, 1. వి(1వ శ. బ్రాహ్మీలిపి), 2. త, 3. తారః , 4. (కు)ష్ట చారు, 5. దురు(7వ శతాబ్దం తెలుగన్నడ లిపి) అని చదివారు. వర్షంవల్ల రంగు కరిగిపోయి లిపి స్పష్టంగా కనిపించడం లేదని తెలిపారు.
గతంలో రాతి చిత్రాలున్న తావులలో పాండవుల గుట్ట, వర్గల్, సీతమ్మలొద్ది వంటి పలుతావుల్లో రాతిచిత్రాలతో పాటు బ్రాహ్మీ నుంచి తెలుగన్నడ లిపిదాకా పలు నామశాసనాలను, పొడి అక్షరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కేవలం రాతి చిత్రాలు కాక రాతలే వుండటం, అవి 1వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు బ్రాహ్మీ, తెలుగన్నడ లిపులు కనిపించడం విశేషం. వీటిని భద్రపరిచి, పరిశోధన చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పరిశోధకులు భావించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
నవంబర్ 21, 2026

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
- ●US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
- ●Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు
- ●Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
- ●PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
- ●ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్

US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!

Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!



