Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు
Chamala Kirankumar Reddy | హరీశ్ రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతారని.. బీఆర్ఎస్ స్క్రిప్ట్ రాస్తే బీజేపీ ప్రజెంటేషన్ చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) విమర్శించారు.
- బీఆర్ఎస్ స్క్రిప్ట్ రాస్తే బీజేపీ ప్రజెంటేషన్ చేస్తుంది
- కిషన్‌రెడ్డి ఆట మొదలై మూడు దశాబ్దాలు దాటింది.. ఒక్క గోలైనా కొట్టిండా
- కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ది అభివృద్ధి లైనా.. నిధులను అడ్డుకునే లైనా?
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: హరీశ్ రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతారని.. బీఆర్ఎస్ స్క్రిప్ట్ రాస్తే బీజేపీ ప్రజెంటేషన్ చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) విమర్శించారు. రాష్ట్రంలో ఆట మొదలైందని అంటున్న కిషన్‌రెడ్డి మూడు దశాబ్దాలు దాటినా ఒక్క గోలైనా కొట్టారా అని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ది ఏ లైనో చెప్పాలన్నారు. ఆరెంజ్, పింక్ కలర్‌గా మారడాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆట మొదలయింది అంటుండు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని పగటి కలలు కంటుండు. మీరు ఆట అడబట్టి 3 దశాబ్దాలు అయింది. మీరు ఇప్పటి వరకు ఒక్క గోల్ కొట్టిన దాఖలు లేవు. దేశంలో బాత్తాయి ఆరెంజ్ కలర్‌లో ఉంటే తెలంగాణలో బాత్తాయి మాత్రం పింక్ కలర్‌లో ఉంటది. ఆరెంజ్, పింక్ కలర్‌గా మారడాన్ని తెలంగాణ సమాజం గమనించాలి.
హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడుతాడు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చింది, మేమే అధికారంలోకి వస్తాం అంటుండు. మీపై ప్రజలకు ఏ విధమైన నమ్మకం ఉందని అధికారంలోకి వస్తారు. బీజేపీ స్టాండ్ ఏంటి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ది ఏ లైన్? రాష్ట్రానికి అభివృద్ధి తెచ్చే లైనా? నిధులను రాకుండా అడ్డుకునే లైనా? తెలంగాణకు పెట్టుబడులు రావాలా వద్దా? మూసీ అభివృద్ధి జరగొద్దా? ప్రజలు మూసీలోనే ప్రజలు మరిగిపోవలా? హైదరాబాద్ మెట్రోను విస్తరించొద్దా? హైదరాబాద్ కు వచ్చే విదేశీయులకు వీసాలు క్యాన్సిల్ చేసినప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడలేదు. రాష్ట్రంలో పెట్టుబలు రావద్దు, కాంగ్రెస్ మంచి పేరు రావొద్దని మీ ఆలోచనా?
ఎన్నడైనా ఆర్టీసీ బస్ ఎక్కినవా?
GCCలో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేయాలి. రాష్ట్రం బాగుపడాలని గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. రాష్ట్రం గురించి కిషన్ రెడ్డికి ఏనాడైనా పట్టింపు ఉందా? ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు అంటుండు. కిషన్ రెడ్డి ఎప్పుడైనా ఆర్టీసీ బస్ ఎక్కిండా? కిషన్ రెడ్డికి ఎందుకు అక్కసు, దరిద్రపు అలవాటు తెలంగాణపై ఎందుకు ప్రేమ లేదు.
డీపీఐఐటీ గణాంకాల ప్రకారం తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మార్చి 2026లో 543 మిలియన్ డాలర్ల నుంచి జూన్ నాటికి 1.32 బిలియన్ డాలర్లకు పెరిగాయి. భారత్ సమ్మిట్‌లో తెలంగాణకు సంబంధించిన ఎనిమిది ప్యానెల్ చర్చలు జరిగాయి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రూ.18,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికపై చర్చించాం. డిసెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఢిల్లీలో జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరై పెట్టుబడులపై మాట్లాడితే, తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు హాజరుకాలేదు? రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు, పెట్టుబడులు తీసుకురావాలి. తెలంగాణకు రావాల్సిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవనం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు, ఐఐఎం ఏర్పాటు వంటి అంశాలపై కిషన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన ఏనాడైనా తెలంగాణ తరఫున గళమెత్తారా?
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ.. రూ.21 వేల కోట్లకు పైగా వ్యయంతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలను వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయిందని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే రాజకీయ ఎజెండాతో తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని చామల ఆరోపించారు. కిషన్ రెడ్డి రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
నవంబర్ 21, 2026

US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
నవంబర్ 21, 2026

Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
- ●US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
- ●Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు
- ●Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
- ●PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
- ●ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్

US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!

Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!



