Patnam Mahender Reddy | రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం: పట్నం మహేందర్‌రెడ్డి
Patnam Mahender Reddy | ముఖ్యమంత్రి (CM) గా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని భూములను అమ్ముతున్నారని, కానీ జిల్లా అభివృద్ధికి నిధులు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ఆరోపించారు.
భూములు అమ్ముతున్నా జిల్లాకు నిధుల కేటాయింపులో వివక్ష
ప్రజలకు సమాధానమివ్వలేకపోతున్నాం
ఇలాగే కొనసాగితే ఉద్యమం తప్పదు
Patnam Mahender Reddy | ముఖ్యమంత్రి (CM) గా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని భూములను అమ్ముతున్నారని, కానీ జిల్లా అభివృద్ధికి నిధులు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ఆరోపించారు. శాసనమండలిలో మంగళవారం ప్రసంగించిన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ యథేచ్ఛగా భూములు అమ్ముతున్న నిధుల కేటాయింపులో జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వాసులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. విక్రయించిన భూమి విలువలో 30 శాతం నిధులను జిల్లా అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
నాడు ఎన్టీ రామారావు మొదలు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా రంగారెడ్డి జిల్లాలోని చాలా భూములను అమ్మారని గుర్తు చేశారు. వచ్చిన వేలాది కోట్లను సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేందుకు వినియోగించారని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం, ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసం రంగారెడ్డి జిల్లా భూములను అమ్మినప్పటికీ, జిల్లాకు మాత్రం అందవలసిన స్థాయిలో నిధులు అందలేదని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తనను, తమలాంటి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విలువైన రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటున్నందున జిల్లా అభివృద్ధికి 30 శాతం నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జిల్లాలో ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కనీసం ఈ ప్రభుత్వమైనా రంగారెడ్డి జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన డబ్బులలో జిల్లా అభివృద్ధి కోసం కనీసం 40% కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






