త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abortion | మహిళకు అబార్షన్‌ కోరుకునే హక్కుంది.. గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి అవ‌స‌రం లేదు: హైకోర్టు

మ‌హిళ‌లు అబార్ష‌న్ (Abortion) చేయించుకోవ‌డంపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. వారికి అబార్ష‌న్‌ కోరుకునే హ‌క్కుంద‌ని, గ‌ర్భాన్ని (Pregnancy) కొన‌సాగించాల‌ని బ‌ల‌వంతం చేయ‌డం వేధించ‌డమేన‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

G

National | Published On Jan 9, 2026, 7.06 am IST

Abortion | మహిళకు అబార్షన్‌ కోరుకునే హక్కుంది.. గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి అవ‌స‌రం లేదు: హైకోర్టు
Advertisement

trinethra.news: మ‌హిళ‌లు అబార్ష‌న్ (Abortion) చేయించుకోవ‌డంపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. వారికి అబార్ష‌న్‌ కోరుకునే హ‌క్కుంద‌ని, గ‌ర్భాన్ని (Pregnancy) కొన‌సాగించాల‌ని బ‌ల‌వంతం చేయ‌డం వేధించ‌డమేన‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయడం, ఆమె శారీరక సమగ్రతకు భంగం కలిగించడమే కాదు, మానసికంగా వేధించడం కిందికి వస్తుందని పేర్కొంది. 14 వారాల గర్భాన్ని అబార్షన్‌ చేయించుకుందంటూ ఓ మహిళపై ఆమె భర్త పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

వైవాహిక సంబంధంలో ఒడిదుడుకులు ఎదురైన సందర్భాల్లో అబార్షన్‌ కోరుకునే హక్కు మహిళకు ఉందని జ‌స్టిస్ నీనా బ‌న్స‌ల్ కృష్ణ‌ (Justice Neena Bansal Krishna) తీర్పు వెలువ‌రించారు. ఐపీసీ సెక్షన్‌ 312 ప్రకారం ఆమె నేరం చేసినట్లు కాదని పేర్కొన్నారు. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి పొందాల్సిన అవసరం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో ఆమెకు పూర్తి స్వతంత్రం ఉంటుంద‌ని చెప్పారు.

వైధవ్యం, విడాకులు వంటి వాటితో వైవాహిక స్థితి మారినా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవచ్చని ఎంటీపీలోని 3–బీ(సీ) చెబుతుంద‌ని తెలిపారు. వివాహబంధంలో ఉన్నంత మాత్రాన మహిళ తన శరీరంపై ఉన్న హక్కును కోల్పోదని పేర్కొన్నారు. ఇదే ఈ చట్టం అసలు ఉద్దేశమన్నారు. ఇష్టం లేని గర్భం మహిళను మానసికంగా కుంగదీస్తుందని, అది ఆమె జీవించే హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement