త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Singh | సజ్జనార్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సంచ‌ల‌న‌ లేఖ

Raja Singh | హైద‌రాబాద్ సీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి ఇటీవ‌ల బ‌దిలీ అయిన వీసీ స‌జ్జ‌నార్‌(VC Sajjanar)పై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

S

Telangana | Published On Nov 15, 2026, 5.29 pm IST

Raja Singh | సజ్జనార్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సంచ‌ల‌న‌ లేఖ
Advertisement

Raja Singh |  త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ సీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి ఇటీవ‌ల బ‌దిలీ అయిన వీసీ స‌జ్జ‌నార్‌(VC Sajjanar)పై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స‌జ్జ‌నార్ హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐ(CBI)తో విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. బంగారం చోరీ, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ద‌ర్యాప్తు దారి మ‌ళ్లింద‌నే అనుమానాల‌పై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. క‌ర్ణాట‌క‌లోని స‌జ్జ‌నార్‌ సొంతూరిలో 100 ఎక‌రాల భూమి కొన్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కూడా విచారించాల‌న్నారు. ఇటీవ‌ల సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రావు సజ్జ‌నార్‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు. ఈమేర‌కు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి రాజాసింగ్‌ లేఖ (Letter) రాశారు.

ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? అన్నది తే ల్చాలని డిమాండ్ చేశారు. జనార్ధన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సజ్జనార్ చేసిన ఇటీవలి ట్వీట్ తర్వాత ఆయన ప్రవర్తన పై పలు ప్రశ్నలు, అనుమానాలు మరింత బలపడ్డాయని రాజా సింగ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఆయన హయాంలో జరిగిన కొన్ని దర్యాప్తుల పారదర్శకత, నిష్పక్షపాతతపై ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.

బంగారం చోరీ కేసు

బంగారం చోరీ కేసులో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటివరకు అరెస్టులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి, వాస్తవాలను తొక్కి పెట్టడానికి ఏవైనా ప్రయత్నాలు జరిగాయా అనేది తేల్చాల‌న్నారు. ఆయన హయాంలో నమోదైన హామ్‌వే కేసులో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తులో ఆశించిన పురోగతి లేదని లేఖలో ఎత్తిచూపారు. ఈ కేసు విచారణలో జాప్యానికి గల కారణాలను స్వతంత్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం దర్యాప్తు దారి మళ్లిందనే తీవ్ర ఆందోళనలు ఉన్నాయని రాజా సింగ్ పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ఉన్నతాధికారుల ప్రమేయంపై ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ విచారణ పురోగతిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. అప్పటి సీపీ సజ్జనార్ పాత్రపై కూడా స్వతంత్ర విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement