Kadiyam Kavya | కాకతీయ జూ అభివృద్ధికి కాంపా నిధులు ఇవ్వండి.. ఎంపీ కావ్య రిక్వెస్ట్
Kadiyam Kavya | హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) నిధులు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వీ క్లెమెంట్ బెన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Kadiyam Kavya | హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) నిధులు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వీ క్లెమెంట్ బెన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూలో సింహాల ఎన్‌క్లోజర్, నైట్ షెల్టర్, హైనా, జాకల్, వైల్డ్‌డాగ్ ఎన్‌క్లోజర్లు, నైట్ షెల్టర్లు, సరీసృపాల ఎన్‌క్లోజర్ల నిర్మాణానికి తెలంగాణ అటవీశాఖ ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు.
సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరణలు చేసి డిజైన్లు, డ్రాయింగ్‌లు అందజేసినందున వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూలాజికల్ పార్కులో జంతువుల సంరక్షణతోపాటు మొక్కల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, విస్తరణ పనులకు కాంపా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జంతువుల కదలికలు, ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షించేందుకు వీడియో, ఆడియో రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధునిక పర్యవేక్షణ సదుపాయాలతో జంతువుల భద్రత, సంరక్షణను మరింత సమర్థంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు.
కాకతీయ జూలాజికల్ పార్కును వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ విద్య, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తే వరంగల్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని ఎంపీ తెలిపారు. కడియం కావ్య విజ్ఞప్తులపై కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది. జూ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..
- ●Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి
- ●KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే
- ●RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..

Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి

KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే






