త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

TG Weather | తెలంగాణ‌లో సోమ‌వారం ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఏప్రిల్ 3 వ‌ర‌కు రాష్ట్రంలో ప‌లుచోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. రానున్న నాలుగు రోజుల్లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగానే ఉంటాయ‌ని తెలిపింది.

P

Telangana | Published On Mar 30, 2026, 4.56 pm IST

TG Weather | తెలంగాణ‌లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో సోమ‌వారం ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఏప్రిల్ 3 వ‌ర‌కు రాష్ట్రంలో ప‌లుచోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. రానున్న నాలుగు రోజుల్లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగానే ఉంటాయ‌ని తెలిపింది. ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వ‌డ‌గ‌ళ్లు కురుస్తాయ‌ని పేర్కొంది. ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన‌లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది.

మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. బుధ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. బుధ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement