త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | | ఇవాళ‌, రేపు.. రాత్రి వేళ దంచికొట్ట‌నున్న వాన‌లు..!

Rain Alert | ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ‌లోని మోస్త‌రు జిల్లాల్లో రాత్రి, ఉద‌యం వేళ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Sep 17, 2026, 8.09 am IST

Rain Alert | | ఇవాళ‌, రేపు.. రాత్రి వేళ దంచికొట్ట‌నున్న వాన‌లు..!
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ‌లోని మోస్త‌రు జిల్లాల్లో రాత్రి, ఉద‌యం వేళ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. ప‌గ‌టి పూట తీవ్ర‌మైన వేడిగాలులు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్నారు. రాత్రి స‌మ‌యానికి వాతావ‌ర‌ణంలో మార్పులు సంభ‌వించి, వాన‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. ఉద‌యం వేళ కూడా వ‌ర్షాల‌కు ఛాన్స్ ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాలకు తోడు ఉరుములు, పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ రెండు రోజుల్లో రాత్రి వేళ భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని బాలాజీ వెల్ల‌డించారు. సాయంత్రం వ‌ర‌కు ఎండ‌లు దంచికొట్టనున్నాయని తెలిపారు.

ఈ జిల్లాల్లోనే భారీ వ‌ర్షాలు..!

నిజామాబాద్, రాజ‌న్న సిరిసిల్ల‌, కామారెడ్డి, మెద‌క్, సిద్దిపేట‌, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, సంగారెడ్డి, జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, నారాయ‌ణ‌పేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement